hyderabadupdates.com movies షాకింగ్… నాగ్ దర్శకుడి మృతి

షాకింగ్… నాగ్ దర్శకుడి మృతి

తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్ కుమార్. ఈ పేరు అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఆ దర్శకుడు అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా తీశాడు. నాగ్ హీరోగా 2006లో వచ్చిన ‘కేడి’ చిత్రాన్ని కిరణే రూపొందించాడు. 

ఐతే ఆ మూవీ ఫ్లాప్ కావడంతో కిరణ్ కెరీర్ ముందుకు సాగలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘క్యూజేకే’ అనే సినిమాను మొదలుపెట్టాడు. దసరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో ఒక హీరో. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల మరో ప్రధాన పాత్ర పోషించాడు. యుక్తి తరేజా కథానాయిక. దసరా, ది ప్యారడైజ్ చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా కిరణ్ కన్నుమూయడం ‌యూనిట్‌కు పెద్ద షాక్.

‘క్యూజేకే’ సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. సినిమా చిత్రీకరణ ఒక దశ వరకు బాగానే జరిగింది. కానీ మధ్యలో కిరణ్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కొన్ని నెలల పాటు చిత్రీకరణ ఆగిపోయింది. కిరణ్ కొంచెం కోలుకుని ఈ మధ్యే తిరిగి షూట్‌కు వచ్చాడు. కానీ ఇంతలోనే మళ్లీ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ‘కేడి’ కంటే ముందు అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన ‘యువ’ సీరియల్‌కు పని చేశాడు కిరణ్. తర్వాత అతడికి నాగార్జున ఫీచర్ ఫిలిం డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. 

నాగ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి వీరి కలయికలో ‘కేడి’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కిరణ్ విభిన్న ప్రయత్నమే చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాక.. సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేయడం గమనార్హం.

Related Post

6 Tamil releases to watch on OTT this week: Arulnithi’s Rambo to Veduvan6 Tamil releases to watch on OTT this week: Arulnithi’s Rambo to Veduvan

Cast: Vinod Sharma, Sahil Vaid, Saumya Daan, Annamaya Verma Creator: Anu Sikka Genre: Animated Mythological Epic Runtime: 9 Episodes Where to watch: Netflix Streaming date: October 10, 2025 Originally in

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యంక్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి