hyderabadupdates.com movies షోలే హీరోకు ‘ఇక్కీస్’ చివరి సెలవు

షోలే హీరోకు ‘ఇక్కీస్’ చివరి సెలవు

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర చివరి సినిమా ఇక్కీస్ నిన్న విడుదలయ్యింది. గత నెలరోజులుగా దురంధర్ ఫీవర్ లో మునిగి తేలుతున్న హిందీ ప్రేక్షకులకు కాస్త తెరిపినిచ్చేలా ఉన్న మూవీగా దీని మీద మంచి బజ్ నెలకొంది.

నిజానికి డిసెంబర్ 25 రిలీజ్ కావాల్సిన ఈ వార్ డ్రామా కేవలం ఆ కారణంగానే వారం వాయిదా వేసుకుంది. ఆరోగ్యం అంతగా సహకరించనప్పటికీ కథ బాగా నచ్చిన ధర్మేంద్ర ఇక్కీస్ లో ప్రధాన పాత్ర పోషించారు. షోలే హీరోకి చివరి సెలవు ఇచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

మాజీ ఆర్మీ ఆఫీసర్ ఎంఏ ఖేత్రపాల్ (ధర్మేంద్ర) పాకిస్థాన్ లో ఉన్న తన స్నేహితులను కలుసుకునేందుకు లాహోర్ వెళ్తాడు. 1971 ఇండో పాక్ యుద్ధంలో కన్నుమూసిన తన 21 ఏళ్ళ కొడుకు అరుణ్ ఖేత్రపాల్ (అగస్త్య నంద) జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు.

అప్పటి యుద్ధ వాతావరణం, శత్రుదేశం చొరబాట్లు, యద్ద ట్యాంకులు ఎదురొచ్చినా మన సైనికులు వాటిని ధీటుగా ఎదురుకున్న విధానం దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ విపులంగా చూపించారు. అయితే సహజంగా ఇలాంటి వార్ డ్రామాలో ఉండే యాక్షన్, ఎలివేషన్ ఇక్కీస్ లో తక్కువ. వాటి కన్నా ఎమోషన్లకే  పెద్ద పీట వేయడంతో ముందే ప్రిపేర్ అవ్వడం మంచిది.

కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టించుకోకుండా అందాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ ఇక్కీస్ తెరకెక్కించారు. ధర్మేంద్రది క్యామియో కాదు. ఫుల్ లెన్త్ రోల్. ఆయనకిది మంచి నివాళి. చివరి సినిమాగా ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కడం దర్శక నిర్మాతల అదృష్టంగా చెప్పొచ్చు.

అగస్త్య నందతో పాటు నటీనటుల పెర్ఫార్మన్స్ చాలా సెటిల్డ్ గా ఉంది. నిన్న తొంభై వేలకు పైగా ఇక్కీస్ టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోవడం మంచి శకునం. యుద్ధం ఎపిసోడ్ చివరి ఇరవై నిముషాలు మాత్రమే ఉంటుంది. కేవలం ఊగిపోయేలా చేసే వార్ సీన్స్  కోసమే వెళ్లే పనైతే ఇక్కీస్ మీ అంచనాలకు బ్యాలన్స్ చేయలేకపోవచ్చు.

Related Post