hyderabadupdates.com movies సంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదు

సంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదు

ఒకే వీకెండ్లో తన సినిమాకు పోటీగా వేరే సినిమా వస్తుంటే.. ఒక చిత్ర బృందంలోని ఏ వ్యక్తి అయినా తమ సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. అవతలి సినిమా మీద కూడా అభిమానం ఉంటే.. తన సినిమా తర్వాత దాన్ని కూడా చూడమని చెబుతారు. కానీ శ్రీలీల మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతోంది. సంక్రాంతి రేసులో ఆమె నటించిన ‘పరాశక్తి’ తమిళంలో మంచి అంచనాల మధ్య విడుదలవుతోంది. 

దీంతో పాటుగా ‘జననాయగన్’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అది విజయ్ చివరి చిత్రం కావడంతో దాని క్రేజే వేరుగా ఉంది. తన సినిమా పోటీలో ఉన్నా సరే.. సంక్రాంతికి తన ఫస్ట్ ఛాయిస్ ‘జననాయగన్’యే అని శ్రీలీల చెప్పడం విశేషం. తాను విజయ్‌కి ఫ్యాన్ గర్ల్ అని, కాబట్టి ఆ సినిమానే ముందు చూసి, తర్వాత ‘పరాశక్తి’ చూస్తానని ఆమె చెప్పింది. తమిళ ప్రేక్షకులు కూడా ఇలాగే చేయాలని.. రెండు సినిమాలూ ఒకదాని తర్వాత ఒకటి చూడాలని ఆమె అభిప్రాయపడింది.

విజయ్ మీద ఎంత అభిమానం ఉన్నా సరే.. తన సినిమా‌ను సెకండ్ ఆప్షన్‌గా చెప్పడం, ప్రేక్షకులూ అలాగే చూడాలని అనడం విశేషమే. విజయ్ చివరి చిత్రం మీదికి పోటీగా ‘పరాశక్తి’ని వదలడం మీద విమర్శల నేపథ్యంలో హీరో శివకార్తికేయన్ సైతం ఇటీవల ఆడియో వేడుకలో ‘ఇది అన్నాదమ్ముల పొంగల్’ అంటూ విజయ్ అభిమానుల్లో తన మీద నెగెటివిటీని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు శ్రీలీల వ్యాఖ్యలతో విజయ్ ఫ్యాన్స్ మరింత కూల్ అవుతారనడంలో సందేహం లేదు. 

మరోవైపు ‘పుష్ప-2’లో ఐటెం సాంగ్ చేయడం గురించి శ్రీలీల స్పందించింది. తాను నటించే సినిమాల్లో మాత్రమే డ్యాన్స్ చేయాలని అనుకుంటానని.. ‘పుష్ప-2’కు మాత్రం మినహాయింపు ఇచ్చానని.. ఆ ఐటెం సాంగ్2కు ఓకే చెప్పడం కఠిన నిర్ణయమని ఆమె చెప్పింది. ఐతే ‘పుష్ప-2’ వల్ల తనకు ఊహించని రీచ్ వచ్చిందని, కాబట్టి ఆ పాట చేయడం మంచి నిర్ణయమేనని శ్రీలీల అభిప్రాయపడింది. ఇకపై ఇలాంటి పాటలు చేయడం సందేహమేనని ఆమె సంకేతాలు ఇచ్చింది.

Related Post

It’s Official: Rajinikanth’s Thalaivar 173 to be produced by Kamal Haasan, Sundar C will directIt’s Official: Rajinikanth’s Thalaivar 173 to be produced by Kamal Haasan, Sundar C will direct

The official statement shared by Kamal Haasan and his production company, Raaj Kamal Films International, reads, “Superstar Rajinikanth is set to headline the magnum opus #Thalaivar173, under Kamal Haasan’s Raaj