hyderabadupdates.com movies సంక్రాంతి సినిమాలకు ‘కేసరి’ కనెక్షన్

సంక్రాంతి సినిమాలకు ‘కేసరి’ కనెక్షన్

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఈ జాబితాలో బోలెడన్ని సినిమాలను చెప్పుకోవచ్చు. ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని ఈ కేటగిరీలోకి చేర్చలేం కానీ.. దాని కథ వేరు. అదేమీ ఫ్లాప్ మూవీ కాదు. కానీ సినిమాలో ఉన్న కంటెంట్‌కు ఇంకా బాగా ఆడాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అనిల్ రావిపూడి కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అనదగ్గ ఈ చిత్రానికి.. తన మిగతా సినిమాల స్థాయి బాక్సాఫీస్ రిజల్ట్ అయితే రాలేదు. 

కానీ అనూహ్యంగా సినిమా రిలీజైన రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఆ సినిమాను అందరూ కొనియాడుతున్నారు సోషల్ మీడియాలో. ఈ చిత్రాన్ని తమిళంలో ‘జననాయగన్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ చూశాక.. ఒరిజినల్‌తో పోల్చి చూసి బాలయ్య ఇంటెన్సిటీని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘జననాయగన్’ కారణంగా గత కొన్ని రోజులుగా ‘భగవంత్ కేసరి’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా సీన్లు, డైలాగులు వైరల్ అవుతుండడంతో.. బాలయ్య ఫ్యాన్స్ మళ్లీ ‘భగవంత్ కేసరి’పై ఒక లుక్కేస్తున్నారు కూడా.

విశేషం ఏంటంటే.. ఈ సంక్రాంతికి రిలీజవుతున్న నాలుగు చిత్రాలతో ‘భగవంత్ కేసరి’కి కనెక్షన్ ఉంది. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ పండక్కే ‘జననాయగన్’తో పోటీ పడుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో ‘భగవంత్ కేసరి’ గురించి మాట్లాడుతున్నాడు అనిల్. ‘భగవంత్ కేసరి’ ప్రొడ్యూసర్ సాహు గారపాటినే చిరు-అనిల్ సినిమాను ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం. 

ఇక ‘భగవంత్ కేసరి’లో విజ్జిగా కీలక పాత్ర చేసిన శ్రీలీల.. తమిళంలో ‘జననాయగన్’కు పోటీగా వస్తున్న ‘పరాశక్తి’లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆమె కూడా తను ప్రమోషన్లలో ‘జననాయగన్’తో పాటు ‘భగవంత్ కేసరి’ గురించి మాట్లాడుతోంది. ఇక మరో సంక్రాంతి మూవీ ‘రాజాసాబ్’కు సంగీతం అందించింది ‘భగవంత్ కేసరి’ మ్యూజిక్ డైరెక్టర్ తమనే కావడం మరో విశేషం.

Related Post

ఇందిర‌మ్మ‌ జ‌యంతి… మ‌హిళ‌ల‌కు రేవంత్ కానుక ఇదే!ఇందిర‌మ్మ‌ జ‌యంతి… మ‌హిళ‌ల‌కు రేవంత్ కానుక ఇదే!

నేడు(న‌వంబ‌రు 19) దేశ మాజీ ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ జ‌యంతి. 1917, న‌వంబ‌రులో ఆమె జ‌న్మించారు. దేశానికి ప్ర‌ధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేద‌లను త‌న‌వైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా.. ఇందిర‌మ్మ ప్రజా ప్రాభ‌వం కోల్పోయింది. ఇదిలావుంటే..

ఒక్క ఫ్లాపుతో మొత్తం తలకిందులుఒక్క ఫ్లాపుతో మొత్తం తలకిందులు

కూలీ విడుదల ముందు వరకు రాజమౌళి రేంజ్ లో హైప్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు కేవలం ఒక్క ఫ్లాప్ మొత్తం తలకిందులు చేసేసింది. అయిదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసినా, అంచనాలు అందుకోలేకపోవడంతో కమర్షియల్ లెక్కల్లో అపజయాల

రెడ్ల‌ను వ‌దిలేసి జ‌గ‌న్ రాజ‌కీయం.. ఫ‌లించేనా..!రెడ్ల‌ను వ‌దిలేసి జ‌గ‌న్ రాజ‌కీయం.. ఫ‌లించేనా..!

రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ, ‘వైనాట్ 175’ మంత్రం పఠించినప్పటికీ కూడా ఆయన పుంజుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన దూరం