hyderabadupdates.com Gallery సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : ఐసీసీ టోర్న‌మెంట్ లో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్, జింబాబ్వే జ‌ట్లు ఎవ‌రికి వారే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌కు గురి చేశారు అభిషేక్ శ‌ర్మ‌, ఇత‌ర బౌల‌ర్లు. దీంతో తీవ్ర స్థాయిలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఆట‌గాళ్ల ఆట తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం . ఈ మ్యాచ్ ఇండియాకు అత్యంత కీల‌కం. ఇందులో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది టీమిండియాకు. చెన్నైలో బుధ‌వారం భార‌త జ‌ట్టుకు చెందిన కోచ్ సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడారు.
జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో సంజు శాంస‌న్, అక్షర్ ప‌టేల్ లకు సంబంధించి ఏవైనా మార్పులు కనిపిస్తాయని మీరు భావిస్తున్నారా అన్న ప్ర‌శ్న‌కు కీల‌క స‌మాధానం ఇచ్చాడు కోట‌క్. అవును, మార్పులు ఉండవచ్చు. మేము ప్రతిదీ చర్చిస్తున్నామని అన్నాడు. ఎందుకంటే మాకు ఇద్దరు ఎడమచేతి వాటం ఓపెనింగ్ బౌలర్లు, మూడవ స్థానంలో ఒక ఎడమచేతి వాటం బౌలర్ ఉన్నారని తెలిపాడు. ప్రత్యర్థి జట్టుకు ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడని పేర్కొన్నాడు సితాన్షు కోట‌క్. నాకు వ్యక్తిగతంగా పెద్ద సమస్య కనిపించడం లేదని అన్నాడు. కానీ మిగ‌తా జ‌ట్ల కంటే త‌మ జ‌ట్టు టాప్ లో కొన‌సాగుతోంద‌ని చెప్పాడు. కానీ ఎందుక‌నో మావాళ్లు అంత‌గా ఫోక‌స్ పెట్ట‌డం లేద‌న్నాడు. ప్ర‌స్తుతం త‌మ ముందు రెండు మ్యాచ్ లు త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. లేకపోతే టోర్నీ నుంచి తాము వైదొల‌గాల్సిన ప‌రిస్తితి నెల‌కొంద‌న్నారు.
The post సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CJI B R Gavai: తనపై దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ గవాయ్‌CJI B R Gavai: తనపై దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ గవాయ్‌

CJI B R Gavai : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌పై దాడికి యత్నించిన ఘటన ఇటీవల కలకలం రేపింది. దీన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా దీనిపై సీజేఐ జస్టిస్‌

Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌

Cloud Seeding : ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ కు బ్రేక్‌ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ (Delhi) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud Seeding) ఫెయిల్‌