hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనా

సంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనా

సంజూ శాంస‌న్  కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనా post thumbnail image

హైద‌రాబాద్ : కేర‌ళ క్రికెట్ స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంసన్ కు అస‌లు ఏమైంద‌ని ఆవేద‌న చెందుతున్నారు ల‌క్ష‌లాది త‌న అభిమానులు. ఇండియ‌న్ క్రికెట్ లో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ల‌లో త‌ను కూడా ఒక‌డు. ఒ వైపు అభిషేక్ శ‌ర్మ‌, ఇంకో వైపు ఇషాన్ కిష‌న్, వైభ‌వ్ సూర్య వంశీ, సూర్య కుమార్ యాద‌వ్ లు దుమ్ము రేపుతుంటే త‌ను మాత్రం సింగిల్ డిజిట్ కే ప‌రిమితం కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిన్న‌టి దాకా దేశీవాళి, ఐపీఎల్ టోర్నీల‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన శాంస‌న్ ఇలా ఆడ‌టం ఏమిటి అని వాపోతున్నారు. ఏరికోరి ఓపెన‌ర్ గా ప‌నికి వ‌స్తాడ‌ని అనుకుంటే చేజేతులారా త‌న కెరీర్ ను పాడు చేసుకోవడం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.
ఈ త‌రుణంలో ఒత్తిళ్ల‌ను త‌ట్టుకోలేక బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీతో పాటు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ప‌నిగ‌ట్టుకుని సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇచ్చారు. కానీ త‌ను అద్భుత‌మైన ఛాన్స్ ను పోగొట్టుకున్నాడు. ఫుట్ వ‌ర్క్ పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో కేవ‌లం ఐదు మ్యాచ్ ల‌లో త‌ను 50 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక ఈనెల 7వ తేదీ నుంచి భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా క‌లిసి ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ కప్ లో పాల్గొనేందుకు తుది జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. త‌న పేల‌వ‌మైన ఆట తీరు కార‌ణంగా ఫైన‌ల్ టీంకు ఎంపిక‌య్యే అవ‌కాశం లేకుండా పోయింది.
ఇదిలా ఉండ‌గా త‌న‌కు ఒక్క‌డు మాత్ర‌మే మ‌ద్ద‌తు ప‌లికాడు. త‌ను ఎవ‌రో కాదు ప్ర‌స్తుతం బీసీసీఐ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా. ఫామ్ అనేది తాత్కాలిక‌మ‌ని, క్లాస్ అనేది శాశ్వ‌త‌మ‌ని , సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు.
The post సంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sricharani: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిSricharani: సీఎం చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణి

    భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌.. క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. ప్రపంచకప్‌ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్‌ అభినందించారు. వరల్డ్

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్

శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..శెభాష్ లోకేష్.. మంచి మాట ఎవ్వరు చెప్పినా..

మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలంటారు పెద్దలు. నాకు తోచింది మాత్రమే చేసుకుంటూ పోతాననే మోనార్క్ పోకడలు లేకుండా.. పెద్దా చిన్నా స్థాయీ భేదాలను ఎంచకుండా మంచి సలహా ఎవ్వరు చెప్పినా సరే.. విని, ఆచరించడానికి పూనుకున్నప్పుడే.. పాలకులు కూడా న్యాయం