hyderabadupdates.com movies ‘సంభవం’… క్రేజీ ఐడియా ఇది

‘సంభవం’… క్రేజీ ఐడియా ఇది

గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి పోలీస్ ఆఫీసర్ల బ్యాక్ డ్రాప్ జోడించి చాలా సినిమాలు తీశారు. వాటిలో అత్యధిక శాతం హిట్టయినవే. మనోళ్లు కూడా ఓటిటిలో డబ్బింగ్ రూపంలో చూసి ఆహా ఓహో అన్నవాళ్ళే. ఈ సిరీస్ లో ఒక కొత్త మూవీ వచ్చింది. దాని పేరు సంభవం అధ్యాయం ఒన్ను. నేరుగా హాట్ స్టార్ లో రిలీజైన ఈ మూవీకి సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ దక్కుతోంది. ఎందుకో చూద్దాం.

అసలీ స్టోరీ పాయింటే క్రేజీగా ఉంటుంది. కేరళ ఆంధ్ర సరిహద్దులో ఉండే ఒక అటవీ ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ మీద వెళ్తాడు ఆనంద్. దారిలో ఒక యాక్సిడెంట్ కనిపించి గాయపడిన మరో పోలీసును ఆసుపత్రిలో చేరుస్తాడు. డ్యూటీ చేరే సమయంలో అడవిలో జరిగిన ఒక దాడి గురించి తెలిసి మరో ఇద్దరు ఆఫీసర్లతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. కానీ లోపలికి వెళ్లే కొద్దీ ముప్పై సంవత్సరాల వెనుకటి సంఘటనలు, మనుషులు ఎదురవుతారు. అసలు ట్విస్టులు మొదలవుతాయి.

కథని ఇక్కడ చిన్నగా చెప్పినప్పటికీ అసలు కంటెంట్ లో బోలెడు ట్విస్టులు పెట్టారు. టైం లూప్ కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా దాన్ని ఒక అడవికి ముడిపెట్టి, కాకి తలతో ఉన్న మనిషి విగ్రహానికి హారర్ ఎలిమెంట్ జోడించి దర్శకుడు జీతూ సతీషన్ మంగళతు కొత్త అనుభూతి కలిగిస్తాడు. ముఖ్యంగా మొదటి అరగంట కాస్త ఓపిగ్గా చూడగలిగితే ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే మలుపులను ఈజీగా గెస్ చేయలేనంత టిపికల్ గా ఉంటాయి.

తెలుగు ఆడియోతో పాటు అందుబాటులో ఉన్న సంభవం అధ్యాయం ఒన్ను ఈ జానర్ సినీ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కాకపోతే మల్లువుడ్ స్టయిల్ స్లో నెరేషన్ ఇందులోనూ ఉంటుంది. ఆ తరహా కథనం అలవాటు లేకపోతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇది మొదటి భాగమే. పార్ట్ 2కి ముఖ్యమైన లీడ్ ఇచ్చి ఆసక్తి పెంచారు. సినిమా చూశాక కలిగే సందేహం ఒకటే. ఇంత క్రేజీ ఐడియాలు మలయాళీ మేకర్స్ కి ఎలా వస్తాయో. ఇలాంటివి థియేటర్ కన్నా డిజిటల్ లోనే బాగా ఆడతాయి.

Related Post

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలురోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడతలోనే రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల

Review: Tovino Thomas’ Pallichattambi –  A Fair Attempt That Struggles to Leave an ImpactReview: Tovino Thomas’ Pallichattambi –  A Fair Attempt That Struggles to Leave an Impact

Movie Name : Pallichattambi Release Date : April 17, 2026 123telugu.com Rating : 2.5/5 Starring : Tovino Thomas, Kayadu Lohar, Prithviraj Sukumaran, Shatru, and others Director : Dijo Jose Antony