hyderabadupdates.com movies సజ్జనార్… కాంగ్రెస్ కండువా కప్పుకో: హరీష్ రావు

సజ్జనార్… కాంగ్రెస్ కండువా కప్పుకో: హరీష్ రావు

ఓ ఐఏఎస్ అధికారితో తెలంగాణ కేబినెట్ లోని ఓ సీనియర్ మంత్రి ప్రేమ వ్యవహారం అంటూ ప్రసారం చేసిన కథనానికిగానూ ఎన్టీవీ క్షమాపణలు చెప్పింది. ఆ క్రమంలోనే ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు ఎన్టీవీ రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ పై, పోలీసుల పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ అడ్డగోలుగా వివాదాస్పద ఆరోపణలు చేసినప్పుడు ఓ మహిళ గౌరవానికి భంగం కలగలేదా అని సజ్జనార్ ను హరీష్ రావు ప్రశ్నించారు. ఆ రోజు సురేఖపై కేసులు పెట్టకపోతే కేటీఆర్ పరువు నష్టం దావా వేశారని గుర్తు చేశారు. ఆ రోజు కేసు ఎందుకు పెట్టలేదని, చట్టం నిద్రపోయిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు సజ్జనార్ చెబుతున్న చట్టం, ఖాకీ బుక్కు ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు. ఆ రోజు చట్టం చుట్టమయిందా అని ప్రశ్నించారు.

ఇప్పుడు మాత్రం మహిళల గౌరవం వారికి గుర్తుకు వచ్చిందని, డీజీపీ, సజ్జనార్ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. ఇక, ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుతో మీడియాను భయభ్రాంతులకు గురిచేయాలని, గుప్పెట్లో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు, తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ కామెంట్లతోపాటు ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుపై సజ్జనార్ స్పందించారు. అంతా చట్ట ప్రకారమే చేస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని, సహకరించని వారిపైనే కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని క్లారిటీనిచ్చారు. ఓ టీవీ ఛానెల్ సీఈవో ను విచారణకు పిలిస్తే రాలేదని ప్రశ్నించారు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలోనే ఆ రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని చెప్పి సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని అన్నారు. అయినా తప్పు చేయనప్పుడు వారికి భయమెందుకని ప్రశ్నించారు.

మహిళా అధికారులను నిరాధార ఆరోపణలతో అవమానించారని మండిపడ్డారు. ఈ తరహా అసత్య కథనాలు ప్రసారమైతే వాళ్లు సమాజంలో ఎలా పనిచేయగలుగుతారని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో విమర్శలు భాగమని, కానీ ఏ మహిళనైనా టీవీ కథనాలు, సోషల్ మీడియా ద్వారా కించపరచడం విమర్శ కాదని, అది క్రూరత్వం అని అన్నారు. భవిష్యత్తు మహిళలదేనని, ఇలా అవమానించి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించే ప్రసక్తే లేదన్న సందేశం నిస్సందేహంగా సమాజానికి తెలియజేయాల్సిందేనని చెప్పారు. ఎమర్జెన్సీ పాలన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. సీఎంపై అవమానకర వార్తలు వేసిన నేపథ్యంలో మరో కేసు నమోదైందని, ఈ రెండు కేసులను సిట్ విచారణ జరుపుతోందని తెలిపారు.

Related Post

Natural Star Nani Stuns as Jadal in a Fierce New Look from The ParadiseNatural Star Nani Stuns as Jadal in a Fierce New Look from The Paradise

Natural Star Nani’s ambitious pan-India project The Paradise is steadily building massive anticipation with each new update. Directed by Dasara fame Srikanth Odela and produced by Sudhakar Cherukuri under the