hyderabadupdates.com movies సజ్జనార్ మాటలు వింటారా?

సజ్జనార్ మాటలు వింటారా?

సోష‌ల్ మీడియా యావ‌లో ప‌డిన చాలా మంది యువ‌కులు, య‌వ‌తులు త‌మ ప్రాణాల‌ను కూడా బ‌లి చేసుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి అనేక సంఘ‌ట‌న‌లు రోజూ ఎక్క‌డో ఒక చోట జ‌రుగుతూనే ఉన్నాయి. కేవ‌లం లైకులు, వ్యూస్ కోసం యువ‌త త‌మ ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారంపై అనేక మంది ప్ర‌ముఖులు ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. కేవ‌లం రీల్స్ కోస‌మో.. వీడియోల కోస‌మో.. జీవితాల‌ను బ‌లి చేసుకోవ‌డం స‌రికాద‌ని చెబుతున్నారు.

తాజాగా జ‌రిగిన ఓఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ.. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌, సోష‌ల్ మీడియాలో మంచి ఇన్లుఫ్యుయెన్స‌ర్‌గా పేరు తెచ్చుకున్న స‌జ్జ‌నార్ కూడా యువ‌త‌కు మ‌రోసారి కొన్ని సూచ‌న‌లు చేశారు. లైకులు, రీల్స్ కోసం..లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకోవ ద్ద‌ని ఆయ‌న మంద‌లించారు.

ఇలాంటి ఘ‌ట‌న‌ల‌తో కుటుంబాలు.. ఏకాకులు అవుతాయ‌న్నారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌ల్లిదండ్రులు జీవితాంతం కుమిలిపోతార‌న్న విష‌యాన్ని రీల్స్ చేస్తున్న యువ‌త గుర్తించాల‌ని సూచించారు. “రీల్స్ కోసం ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్ట‌డం స‌రికాదు. యువ‌త ఆలోచ‌న చేయాలి.“ అని స‌జ్జ‌నార్ చెప్పారు. మ‌రి యువ‌త వింటారా?  లేదా? అనేది చూడాలి.

“సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక!! నడుస్తున్న రైలుకు వేలాడుతూ చేసే ఈ స్టంట్లు చూస్తుంటే.. ప్రాణం మీద తీపి కంటే, ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశ ఎక్కువైపోయినట్టుంది. ఇలాంటి తెలివితక్కువ పనుల వల్ల ఆ యువకుడికి దక్కింది ఏంటి? కేవలం ఆస్పత్రి బెడ్ లేదా అంతిమయాత్రే కదా! మీ పిచ్చి విన్యాసాలకు ప్రాణం పోయే వరకు ఆగుతారా? ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? లైకుల కోసం లైఫ్ రిస్క్ చేసేంత పిచ్చి వద్దు. ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరు.. మీ కుటుంబం మాత్రం జీవితాంతం కన్నీళ్లు పెడుతుంది.“ అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

ఓ యువ‌కుడు క‌దులుతున్న రైలులో మెట్ల‌పై నిల‌బ‌డి బ‌య‌ట‌కు విహ‌రిస్తున్న‌ట్టుగా.. రీల్ చేస్తున్నాడు. రెండు చేతుల‌తో డోర్ రాడ్ల‌ను ప‌ట్టుకోగా.. బాగా పూర్తిగా వెన‌క్కి వంగిపోయిన ద‌శ‌లో  అత‌ను రీల్ చేస్తున్నాడు. ఇంత‌లో.. ఓ విద్యుత్ స్తంభం అత‌నిని బ‌లంగా ఢీకొట్ట‌డంతో..వెంట‌నే కింద ప‌డిపోయి.. అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ వీడియోను స‌జ్జ‌నార్ త‌న సామాజిక మాధ్య‌మంలో పోస్టు చేసి.. యువ‌త‌కు హెచ్చ‌రిక‌లు.. సూచ‌న‌లు చేశారు.

Related Post

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారుజీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో జీతాలు తీసుకుని..వారి త‌ర‌ఫున స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. స‌భ‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. బుధ‌వారం

Rajamouli’s Frustrated Comment at Trailer Event Sparks Unexpected Social Media StormRajamouli’s Frustrated Comment at Trailer Event Sparks Unexpected Social Media Storm

At the Globe Trotter event held yesterday for the trailer launch of SS Rajamouli and Mahesh Babu’s upcoming film, an unexpected controversy overshadowed the celebrations. The much-awaited trailer screening faced