hyderabadupdates.com Gallery స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్

స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్

స‌న్నీ డియోల్ బోర్డర్ -2  భారీ ఓపెనింగ్స్ post thumbnail image

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌న్నీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సీక్వెల్ చిత్రం బోర్డ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది భారీ అంచ‌నాల మ‌ధ్య‌. ఎవ‌రూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన ఓపెనింగ్స్ న‌మోదు చేయ‌డం తో మూవీ మేక‌ర్స్, నిర్మాత‌లు సంతోషంలో మునిగి పోయారు. బోర్డ‌ర్ -2లో స‌న్నీ డియోల్ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఫ‌తే సింగ్ క‌లేరి పాత్ర పోషించాడు. ద‌ర్శ‌కుడు దీనిని పూర్తిగా ఎపిక్ యాక్ష‌న్ వార్ డ్రామాగా తెర‌కెక్కించాడు. అంద‌రూ విస్తు పోయేలా ఏకంగా ఆదిత్య ధ‌ర్ తీసిన ర‌ణ్ బీర్ క‌పూర్, సారా అర్జున్ క‌లిసి న‌టించిన ధురంధ‌ర్ క‌లెక్ష‌న్స్ ను కూడా తొలి రోజు దాటేసింది.
ఈ సీక్వెల్ తొలి రోజు ప్ర‌ద‌ర్శ‌న 2025లో అతి పెద్ద ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా పేరు పొందిన చావా మూవీ సాధించిన రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. బోర్డ‌ర్ -2 జ‌న‌వ‌రి 23న శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభ‌మైంది. విడుద‌లైన ప్ర‌తి థియేట‌ర్ ఫ్యాన్స్ తో, ప్రేక్ష‌కుల‌తో నిండి పోయింది. సినిమాస్ అద్భుతమైన ఆక్యుపెన్సీ స్థాయిలను నివేదించాయి. పట్టణ కేంద్రాలు, మల్టీప్లెక్స్‌లు నిండి పోయాయి.
కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి. విశ్వసనీయ నివేదికల ప్రకారం, బోర్డర్ 2 భారత బాక్సాఫీస్ వద్ద రూ. 32.10 కోట్ల నికర వసూళ్లను ఆర్జించింది. ఆదివారం కంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పెరిగే ఛాన్స్ ఉంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
The post స‌న్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

    ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్‌

వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్

విజ‌య‌వాడ‌ : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌ను రీ స‌ర్వే చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతే కాకుండా స‌ర్వే చేసిన భూముల వివ‌రాల‌ను ఆన్ లైన్