hyderabadupdates.com movies సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సమ ప్రాధాన్యమిస్తూ.. రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.

గత నెలలో ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా మార్గమధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం అయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందిన నిర్మలమ్మ, సాంబయ్యలు తమ కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, సమస్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అందుకు అనుగుణంగా విద్యుత్ సిబ్బంది 260 మీటర్ల మేర 8 కొత్త స్తంభాలు వేసి, యుద్ధప్రాతిపదికన వైర్లు లాగి యానాదుల కాలనీలోని నివాస గృహాలకు విద్యుత్ సదుపాయం కల్పించారు. 15 రోజుల్లోనే నిర్మలమ్మ ఇంటితోపాటు కాలనీలోని మిగిలిన గృహాలకు సహా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.

అడిగిన వెంటనే స్పందించి విద్యుత్ సదుపాయం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు యానాది కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. యానాది కాలనీవాసుల సమస్యను పరిష్కరించిన జిల్లా అధికారులను, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ సిబ్బందినీ ఉప ముఖ్యమంత్రి అభినందించారు.

గంటల వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం చూపించిన పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.#PawanKalyanAneNenu #PawanKalyanForPithapuram pic.twitter.com/ig5LeJ6D5j— JanaSena Party (@JanaSenaParty) January 10, 2026

Related Post

డిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూడిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూ

మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి, దురంధర్ ఏదో నెట్టుకొస్తున్నాయి కానీ చాలా స్క్రీన్లు తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఫీడింగ్ కోసం తేరే ఇష్క్ మే డబ్బింగ్