hyderabadupdates.com movies ‘సరస్వతి’ పరీక్షకు సిద్ధమవుతున్న వరలక్ష్మి

‘సరస్వతి’ పరీక్షకు సిద్ధమవుతున్న వరలక్ష్మి

టాలీవుడ్లో మహిళా దర్శకులు తక్కువ. ఉన్నంతలో మనమే బెటర్ కానీ ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. నటి వరలక్ష్మి శరత్ కుమార్ డెబ్యూ డైరెక్షన్ చేసిన సరస్వతి ఎల్లుండి మార్చి 6 విడుదల కానుంది. సాయి మాధవ్ బుర్రా కథ, తమన్ సంగీతం లాంటి బలమైన టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు అండగా నిలబడింది. నందమూరి బాలకృష్ణ ట్రైలర్ వీక్షించి ఖచ్చితంగా సినిమా చూడమంటూ వీడియో రూపంలో రికమండేషన్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు వచ్చారు.

శరత్ కుమార్, రాధికాతో పాటు ఆయన ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం ఇంటర్వ్యూలు ఇస్తూ పబ్లిసిటీలో భాగమవుతోంది. ఈ విధంగా పాజిటివ్ వైబ్స్ చాలానే ఉన్నాయి. మాతృబాష కన్నా తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చిన వరలక్ష్మి ఇక్కడి ఆడియన్స్ టేస్ట్ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారు. పాప సెంటిమెంట్, క్రైమ్ ఎలిమెంట్, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఇలా అన్ని అంశాలు మేళవించి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో దీన్ని తెరకెక్కించినట్టు సమాచారం. సర్ప్రైజ్ క్యామియో, ఊహించని ట్విస్టులు చాలానే ఉంటాయట. స్క్రీన్ మీద అవి థ్రిల్ పంచుతాయని అంటున్నారు.

పోటీ పరంగా చూసుకుంటే శ్రీవిష్ణు విష్ణు విన్యాసం, శివాజీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, మ్యాన్షన్ హౌస్ మల్లేష్ లాంటివి బాగానే కవ్విస్తున్నాయి. అయితే సరస్వతిలో వాటిని ధీటుగా ఎదురుకునే కంటెంట్ ఉందని నిర్మాతల గట్టి నమ్మకం. సరస్వతి ఆడటం వల్ల మరికొందరు మహిళా దర్శకులకు స్ఫూర్తి దొరుకుతుందని చెప్పొచ్చు. గత ఏడాది నీరజ కోన తెలుసు కదాతో పరిచయమయ్యారు.

ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న సంగీత్ శోభన్ రాకాస కూడా లేడీ డైరెక్టర్ తీసిందే. గతంలో వరుడు కావలెను లాంటి సినిమాలు కూడా ఇదే కోవలో వచ్చాయి. ఒక్క విజయనిర్మల గారు మాత్రమే గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు ఎక్కేంత స్థాయిలో సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని ఎవరైనా అధిగమిస్తారని కాదు కానీ కనీసం చెప్పుకోదగ్గ కౌంట్ లో సరస్వతి లాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి. ప్రకాష్ రాజ్, ప్రియమణి, మురళీశర్మ, రాధికా, నాజర్, తులసి లాంటి పెద్ద క్యాస్టింగ్ ఇందులో ఉంది. ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేకపోవడం సరస్వతిలో అసలు ట్విస్టు.

Related Post

Stranger Things Isn’t Over: Upside Down Returns in 2026 Animated Series Tales From ’85Stranger Things Isn’t Over: Upside Down Returns in 2026 Animated Series Tales From ’85

The Duffer Brothers explained in a Netflix featurette that an animated series was one of their earliest ideas for expanding the Stranger Things universe. Matt Duffer said, “When we started

అకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలిఅకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలి

పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన అనుమతి, ప్రమేయం లేకుండా ఏఐ లవ్ స్టోరీ అనే ఇండిపెండెంట్ మూవీని తీసి, దాన్ని యూట్యూబ్ లో