‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి చిత్రాలతో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్న కిరణ్‌కు ‘క’ మూవీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. కానీ ‘దిల్ రుబా’తో మళ్లీ షాక్ తిన్నాడు.
ఇప్పుడు ‘కే ర్యాంప్‌తో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. ఐతే కిరణ్ ఇప్పటిదాకా చిన్న, మీడియం బడ్జెట్లలోనే సినిమాలు చేశాడు. అందుకు తగ్గట్లే తన సినిమాలకు టెక్నీషియన్లు పని చేశారు. కానీ అతను త్వరలోనే పెద్ద షాకివ్వబోతున్నాడు. పెద్ద బడ్జెట్లో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన అనిరుధ్ రవిచందర్ ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడంటేనే దాని రేంజ్ అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో అనిరుధ్‌తో పని చేయించుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు. తనకిచ్చే బడ్జెట్లో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు. అలాంటిది చిన్న సినిమాలు చేసుకునే కిరణ్.. అనిరుధ్‌తో జట్టు కట్టడమంటే షాకింగ్ కొలాబరేషనే. ఒక ఇంటర్వ్యూలో తాను అనిరుధ్‌తో కలిసి పని చేయనున్న విషయాన్ని స్వయంగా కిరణే కన్ఫమ్ చేశాడు. ఈ చిత్రాన్ని ఒక తమిళ దర్శకుడు రూపొందిస్తాడని కూడా అతను ధ్రువీకరించాడు. పెద్ద బడ్జెట్లోనే సినిమా ఉంటుందని.. తమిళ, తెలుగు భాషల్లో ఆ చిత్రం తెరకెక్కుతుందని అతను వెల్లడించాడు.
‘కే ర్యాంప్’ దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుండగా.. దాని తర్వాత ‘చెన్నై లవ్ స్టోరీ’తో అతను ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఆపై సుకుమార్ శిష్యుడు వీరా కోగటంతో ఓ క్రైమ్ థ్రిల్లర్ చేస్తాడు. దాని తర్వాత కిరణ్ చెబుతున్న బిగ్ బడ్జెట్ మూవీ ఉండొచ్చు. దాంతో పాటుగా సొంత బేనర్లో తనకు సన్నిహితుడైన ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో సొంత బేనర్లో ఓ సినిమ ా చేయనున్నాడు కిరణ్.