అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిలకు సంబంధించి రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. గతంలో చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి మరో విడత బకాయిలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత నెలలో రూ.2.42 కోట్ల మేర బకాయిలను చేనేత సహకార సంఘాలకు చెల్లించామని చెప్పారు. సంక్రాంతి పండగ దృష్ట్యా మరో రూ.5 కోట్లు చెల్లించాలని ఆప్కో యాజమాన్యాన్ని మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి సవిత ఆదేశాల మేరకు సోమవారం చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో బకాయిలు జమ చేయడానికి ఆప్కో సిద్ధమైంది.
చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత ఈ సందర్బంగా స్పష్టం చేశారు. నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి పొందేలా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో సామూహికంగా చేనేత సహకార సంఘాల ద్వారా లబ్ధి కలిగేలా మరికొన్ని పథకాలు వర్తింప జేస్తున్నామన్నారు ఎస్. సవిత. చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు నూతన కొనుగోళ్లను సైతం ప్రారంభించినట్లు మంత్రి సవిత తెలిపారు. నేతన్నలు గౌరవ ప్రదమైన జీవనం సాగించడంతో 365 రోజులూ వారికి ఉపాధి కల్పించాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యమన్నారు.
The post సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల
Categories: