hyderabadupdates.com movies ‘సార్’ రవితేజ చేసి ఉంటే..?

‘సార్’ రవితేజ చేసి ఉంటే..?

మాస్ రాజా రవితేజ తన ఇమేజ్‌కు తగ్గ మాస్ మూవీస్ చేసినపుడే ఎక్కువ సక్సెస్ అయ్యాడు. ఆయనకు డిఫరెంట్ మూవీస్ చేయాలని, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో సత్తా చాటుకోవాలని ఉంటుంది. ఆ దిశగా అప్పుడప్పుడూ ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవి వర్కవుట్ కావడం అరుదు. ‘నా ఆటోగ్రాఫ్’ నుంచి ‘ఈగల్’ వరకు ఆయన భిన్నంగా ప్రయత్నించిన ప్రతిసారీ ఎదురు దెబ్బే తగిలింది.

ఇప్పుడు ఆయన ‘మాస్ జాతర’ అనే పక్కా మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాగా తమిళ స్టార్ ధనుష్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ‘సార్’ మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిజానికి రవితేజే చేయాల్సిందట. ఆయనకు ఈ సినిమాకు కచ్చితంగా ఒక డిఫరెంట్ అటెంప్ట్‌గా ఉండేది. రవితేజను దృష్టిలో ఉంచుకునే దర్శకుడు వెంకీ అట్లూరి ఆ కథ రాశాడట. కానీ రవితేజకు ఖాళీ లేక ధనుష్‌తో ఆ సినిమా చేయాల్సి వచ్చిందట వెంకీ.

ఐతే తన నుంచి వేరొకరి దగ్గరికి ఆ కథ వెళ్లినా రవితేజ ఏమాత్రం ఫీలవ్వలేదట. పైగా ధనుష్ అయితే అదిరిపోతుందని.. అతనే ఈ సినిమాకు కరెక్ట్ అని కూడా చెప్పాడట. సినిమా రిలీజయ్యాక కూడా రవితేజ ఇదే మాటకు కట్టుబడ్డాడట. తాను చేస్తే ఆ సినిమా అంత బాగుండేది కాదని నిర్మొహమాటంగా చెప్పాడట. ముందు ఈ కథను రవితేజకు చెప్పినపుడు ఆయనకు ఎంతో నచ్చిందని.. కానీ తనకు ప్రస్తుతం ఖాళీ లేదు కాబట్టి వెయిట్ చేయగలవా అని అడిగాడట రవితేజ. 

వేరే ఆప్షన్ ఉంటే కచ్చితంగా సినిమా చేసుకోమని అన్నాడట. కొన్ని నెలల తర్వాత ఇలా ధనుష్‌తో చేస్తున్నా అంటే.. తనకు ఆ సమాచారం ఇచ్చినందుకు చాలా హ్యాపీ అని, ధనుష్ అయితే అదిరిపోతుందని చెప్పి ఎంకరేజ్ చేశాడట మాస్ రాజా. ఐతే రవితేజ చేస్తే సినిమా ఇంకా బాగుండేదని వెంకీ అంటే.. రవితేజ మాత్రం ధనుష్‌కే తనకంటే బాగా ఆ సినిమా కుదిరిందని అన్నాడు. రవితేజ, వెంకీ కలిసి ‘మాస్ జాతర’ దర్శకుడు భాను భోగవరపుతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో ఈ చర్చ జరిగింది.

Related Post

Geetha Madhuri’s Soulful Voice Elevates- Naa Peru ShambhalaGeetha Madhuri’s Soulful Voice Elevates- Naa Peru Shambhala

Aadi Sai Kumar’s upcoming supernatural thriller Shambhala: A Mystical World has swiftly become one of the most discussed projects in recent times. Produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under

Ram’s Andhra King Taluka: Fourth single ‘First Day First Show’ gets a launch dateRam’s Andhra King Taluka: Fourth single ‘First Day First Show’ gets a launch date

Hero Ram’s much-awaited film, Andhra King Taluka, is making all the right noises ahead of its release on November 28, 2025. Sandalwood star Upendra and young actress Bhagyashri Borse play