hyderabadupdates.com movies సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియ‌నుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్లో అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలను మంత్రులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా కార్పొరేషన్ లో మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేరువ అవుతున్న తీరును మంత్రులు తెలుసుకున్నారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి సింగపూర్ మోడల్ లో మున్సిపాలిటీలను కార్పొరేషన్లు డెవలప్ చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే మంత్రులను సింగపూరుకు పంపించారు. వీరిలో బిజెపికి చెందిన సత్య కుమార్ యాదవ్ కూడా సింగపూర్ వెళ్లారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సింగపూర్ ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు, అదేవిధంగా సాధారణ ప్రజలకు అందిస్తున్న వైద్యంపై ఆయన అక్కడ పరిశీలన చేశారు. అలాగే.. అచ్చ‌న్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి వంగలపూడి అనిత, నారాయణ వంటి వారు కూడా సింగపూర్లో అవలంబిస్తున్న విధానాలు తెలుసుకున్నారు.

శాంతి భద్రతలు.. నగరాల పునర్నిర్మాణం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న పాలన సంక్షేమ పథకాలు వంటి అన్ని అంశాలను అధ్యయనం చేశారు. మంత్రులు అక్కడి సలహాదారులతో కూడా భేటీ అయ్యారు. తద్వారా ఏపీలో సంస్కరణలు తీసుకురావడానికి వీరు కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ -అక్టోబర్ లో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సంస్కరణల ఫలాలను ముఖ్యంగా సింగపూర్ మోడల్ లో ప్రజలకు అందించాలన్నది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ క్రమంలోనే మంత్రుల పర్యటన ముగిసింది. తద్వారా రాబోయే రోజుల్లో సింగపూర్ తరహా పాలన రాష్ట్రంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రెవిన్యూ, శాంతిభద్రతలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మెరుగైన మార్పులు తీసుకురావడం ఖాయమని అంటున్నారు. తద్వారా ఏపీలో ప్రజలకు ఒక సరికొత్త పరిపాలనను అందించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు.

Related Post

Trimukha Completes Shooting, Gears Up for Grand December ReleaseTrimukha Completes Shooting, Gears Up for Grand December Release

The much-awaited pan-Indian film Trimukha has officially wrapped up its shooting. The makers announced the news with a striking new poster released during Dussehra, sparking huge excitement among fans and