hyderabadupdates.com Gallery సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం

సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం

సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం post thumbnail image

హైద‌రాబాద్ : సింగ‌ర్ గా పేరు పొందిన మంగ్లీ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారారు. గ‌తంలో త‌ను డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు తాజాగా ఏకంగా రూ. 10 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్లు తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మంగ్లీపై హైద‌రాబాద్ లో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు ఫిర్యాదు చేయ‌డంతో త‌న నిర్వాకం గురించి బ‌య‌ట ప‌డింది. గ‌త కొంత కాలంగా సింగ‌ర్ మంగ్లీ పెద్ద ఎత్తున త‌న‌కు ఉన్న ఆద‌ర‌ణ‌ను అడ్డం పెట్టుకుని ఇలాంటి దందాల‌కు తెర లేపిందంటూ విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం మంగ్లీ నిర్వాకంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మేర‌కు ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో తాజాగా కేసు న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపింది.
త‌న‌ను రూ. 10 కోట్లు మోసం చేసింద‌ని, సింగ‌ర్ మంగ్లీ నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ స‌ద‌రు బాధితుడు వాపోయాడు. మంగ్లీతో పాటు ఆమె సోద‌రుడు, మ‌రో ముగ్గురు వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేశారు. వీరిపై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్‌లు 351 (2), 352 కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) దాఖలు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఈ సంద‌ర్భంగా బాధితులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న‌ను నిత్యం బెదిరిస్తున్నారంటూ వాపోయారు. త‌న‌కు పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరాడు. లేక‌పోతే త‌న‌ను చంపేస్తారంటూ క‌న్నీటి ప‌ర్యంతం కావ‌డం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఇదిలా ఉండ‌గా మంగ్లీ స్వ‌స్థ‌లం రాయ‌ల‌సీమ‌. త‌న అస‌లు పేరు స‌త్య‌వ‌తి చౌహాన్. తొలుత యాంక‌ర్ గా ప‌నిచేసింది. తెలంగాణ మాండ‌లికంపై ప‌ట్టు సంపాదించింది. సింగ‌ర్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు అక్ర‌మాల‌కు, మోసాల‌కు , దందాల‌కు తెర లేపింది మంగ్లీ.
The post సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్CP Sajjanar: చాదర్‌ఘాట్ కాల్పులపై స్పందించిన వీసీ సజ్జనార్

  చాదర్‌ఘాట్ (Chaderghat) విక్టోరియా గ్రౌండ్‌లో  మొబైల్ దొంగపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఇందుకు గల కారణాలను పోలీసు

Japan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జ‌పాన్ రాయ‌బారి తెలుగు ప్ర‌సంగంJapan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జ‌పాన్ రాయ‌బారి తెలుగు ప్ర‌సంగం

      విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు వివిధ దేశాల్లోని పెట్టుబ‌డిదారుల‌ను ఆకట్టుకోవ‌డ‌మే కాదు. మ‌న తెలుగు భాష కూడా వారిని ఆక‌ట్టుకుంటోంది. ప‌రాయి దేశ‌స్తులైనా క‌ష్ట‌మైన కొంత‌మంది తెలుగు భాష మాధుర్యాన్ని చ‌విచూస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. త‌మ‌కు క‌ష్ట‌మైనా త‌మ

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసాఅన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప‌థ‌కంతో భ‌రోసా

అమ‌రావ‌తి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను