హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సికింద్రాబాద్ పై. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ చరిత్రను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో వైపు ఈ నగరానికి చెందిన ప్రజలు స్వచ్చంధంగా బయటకు వచ్చారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ లోనే అతి పెద్ద జనాభా కలిగిన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు ఈటల రాజేందర్. శనివారం ఆయన సికింద్రాబాద్ పై జరుగుతున్న వివాదంపై స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండూ అద్భుతమైన నగరాలని, ఈ రెండింటికి ఘనమైన వారసత్వం, చరిత్ర ఉందన్నారు ఈటల రాజేందర్. ఇంకొకరు చెరిపి వేయాలని చూస్తే వారిని జనం క్షమించరని అన్నారు.
సికింద్రాబాద్ పేరును ఎవరు తక్కువ చేయకూడదు అలా అని మల్లజిగిరిని కూడా తక్కువ చేయవద్దని సూచించారు ఈటల రాజేందర్. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లంతా మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన వారేనని చెప్పారు. సికింద్రాబాద్ చరిత్ర, గ్లామర్, గొప్పదనానికి తాను వ్యతిరేకం కాదని అన్నారు. కానీ మల్కాజిగిరి పేరు మార్చమనడం సరికాదని స్పష్టం చేశారు. మార్చాలి అనే వారు అనాడు అధికారంలో ఉన్నారని, అప్పుడు ఎందుకు సికింద్రాబాద్ ను జిల్లాగా ప్రకటించ లేక పోయారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు ఈటల రాజేందర్.
The post సికింద్రాబాద్ నగరం చరిత్ర ఘనం : ఈటల రాజేందర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సికింద్రాబాద్ నగరం చరిత్ర ఘనం : ఈటల రాజేందర్
Categories: