hyderabadupdates.com movies సిద్దు అందుకే సౌమ్యంగా ఉన్నాడా

సిద్దు అందుకే సౌమ్యంగా ఉన్నాడా

ఇంకో అయిదు రోజుల్లో తెలుసు కదా విడుదల కానుంది. టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సినిమా అంటే మాములుగా ఓ రేంజ్ సందడి కనిపించాలి. కానీ టీమ్ మాత్రం రెగ్యులర్ ప్రమోషన్లకు పరిమితమయ్యింది. దర్శకురాలు నీరజ కోన ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. సిద్దు రవితేజతో కలిసి ఒక స్పెషల్ ముఖాముఖీ చేస్తే అందులో విషయాలు బాగానే బయటికి వెళ్తున్నాయి కానీ అసలు హైలైట్ అవ్వాల్సిన తెలుసు కదా కంటెంట్ జనాలకు రీచ్ అవ్వడం లేదు. హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి తమవంతుగా ఏం చేయాలో అంతా చేస్తున్నారు. కానీ పబ్లిసిటీ పరంగా పోటీతో పోలిస్తే తెలుసు కదా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తోంది.

కొంచెం లోతుగా ఆలోచిస్తే సిద్ధూ సౌమ్యంగా ఉండడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న జాక్ తీవ్రంగా నిరాశపరిచింది. పైగా నిర్మాతకు నష్టం వస్తే తన పారితోషికంలో కొంత వెనక్కు ఇచ్చి మరీ సిద్ధూ తన బాధ్యతను నెరవేర్చాల్సి వచ్చింది. సో తెలుసు కదా విడుదలకు ముందు లౌడ్ ప్రమోషన్లతో హడావిడి చేయడం కన్నా టాక్, రివ్యూస్ ని మెప్పించగలమనే ధీమాతో తన రెగ్యులర్ స్టైల్  కి దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ట్రైలర్ కూడా ఆలస్యం చేశారు. తమన్ పాటలు రీచ్ అయినా వాటిని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసుకోలేదు. కానీ అవతల పండగ కాంపిటీషన్ అలా లేదు.

కె ర్యాంప్ టీమ్ ఇప్పటికే సరిపడా బజ్ తెచ్చేసుకుంది. కిరణ్ అబ్బవరం స్టేట్ మెంట్లు, ట్రైలర్, యూనిట్ చేస్తున్న వినూత్నమైన మార్కెటింగ్, ఎక్కువ మీడియా అండ్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం తదితరాలు హైప్ తెస్తున్నాయి. డ్యూడ్ డబ్బింగ్ మూవీ కావడంతో దాని వరకు ఎంత చేయాలో అంతా చేశాడు ప్రదీప్ రంగనాధన్. ఇక మిత్ర మండలి ముందు జాగ్రత్తగా ఎర్లీ ప్రీమియర్స్ కు వెళ్లే ఆలోచనలో ఉంది. ఓకే అయితే అక్టోబర్ 15 సాయంత్రం నుంచే షోలు ఉంటాయి. సో తెలుసు కదా ఇక మేజిక్ చేయాల్సింది ట్రైలర్ అండ్ కంటెంట్ తోనే. ఏదో షాకింగ్ పాయింట్ ఉందంటున్నారు, అది కనెక్ట్ అయితే సూపర్ హిట్టేనట.

Related Post