hyderabadupdates.com movies సీఎంపై బావాబామ్మర్దుల షాకింగ్ కామెంట్స్

సీఎంపై బావాబామ్మర్దుల షాకింగ్ కామెంట్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పొట్టోడా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి నిన్న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే మరోసారి రేవంత్ ను కేటీఆర్ టార్గెట్ చేశారు. కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

తిడితే తనను తిట్టాలనీ…కేసీఆర్ ను, కార్యకర్తలను తిడితే మాత్రం ఊరుకోబోం పొట్టోడా అంటూ హెచ్చరించారు. రెండేళ్ల తర్వాత గులాబీ జెండా అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు పాతాళంలో దాక్కున్నా సరే రేవంత్ ను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

ఇక, పథకాలు రావడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతల లాగులో తొండలు వదిలిపెడతానని అంటున్నారని, కాబట్టి ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని…లాగుల తొండల్ రెడ్డి అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

గట్టిగా రామాయంపేటలో గుద్దు గుద్దితే జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి గువ్వ పగలాలి అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, కొందరు పోలీసులు ఎక్స్ ట్రాలు చేస్తున్నారని, అటువంటి పోలీసుల నట్లు, బోల్టులు ఫిట్ చేస్తానని హెచ్చరించారు.

రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాను మంత్రిగా ఉంటానని జోస్యం చెప్పారు. మంచికి మంచి, మర్యాదకు మర్యాద అని, తేడా వస్తే అరెస్టులకైనా, దేనికైనా సిద్ధం అని అన్నారు. ఇలా, బావాబామ్మర్దులు హరీశ్, కేటీఆర్ లు ఒకరి తర్వాత ఒకరు రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ టార్గెట్ చేస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.

Related Post

Yash’s Toxic Movie Postponed, Dhurandhar: The Revenge Too Eyeing a New Release Date ?Yash’s Toxic Movie Postponed, Dhurandhar: The Revenge Too Eyeing a New Release Date ?

Minutes to read: 3 min The much-anticipated movie Toxic: A Fairytale For Grown-Ups, starring Yash in a double role, Nayanthara, Kiara Advani, Huma Qureshi, Rukmini Vasanth, and Tara Sutaria in

రాజశేఖర్ నిజాయితీకి అవకాశాలు రావాలిరాజశేఖర్ నిజాయితీకి అవకాశాలు రావాలి

ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష రాని రాజశేఖర్ దర్శకుడు కోడి రామకృష్ణతో చేసిన సినిమాలు గట్టి పోటీ ఇచ్చేలా చేశాయి. ముఖ్యంగా అంకుశం సృష్టించిన సునామీ