hyderabadupdates.com Gallery సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి

సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి

సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి post thumbnail image

విజ‌యవాడ : పవిత్ర కృష్ణా నది తీరాన ప్రారంభమైన ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవనుందని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడలో జరిగిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న కళలు, సాహిత్యం, సినిమా, జానపద సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పించడమే ఈ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు సీఎం. ప్రతి తెలుగు ఇంటికి ఆవకాయ్‌తో ఉన్న అనుబంధం లాగే ఈ ఉత్సవం సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకం, కళా ప్రదర్శనల సమ్మేళనంగా ప్రజల మనసులను కలుపుతోందని చెప్పారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కందుల దుర్గేష్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు నారా చంద్రబాబు నాయుడు.
అభివృద్ధి అనేది కేవలం ఐటీ, పరిశ్రమలకే పరిమితం కాదని అన్నారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ద్వారా కూడా ఉపాధి, అవకాశాలు సృష్టించ వచ్చని అన్నారు. కథలు, సినిమాలు, డిజిటల్ కళలే పెట్టుబడులుగా మారే ఈ దశను తాను ఆరెంజ్ రెవల్యూషన్ గా భావిస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ కృష్ణా నది తీరం ఒక సాంస్కృతిక పాఠశాలగా మారనుందని చెప్పారు. 60 మందికి పైగా ప్రముఖ కళాకారులు, 40 మంది వక్తలు, 13 కళా బృందాలతో 28 ప్రత్యేక కార్యక్రమాలు, అంతర్జాతీయ వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నామ‌ని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం 2024–29 ద్వారా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం జ‌రిగింద‌ని చెప్పారు. దీని వల్ల పెట్టుబడులు పెరిగి, పర్యాటకం కొత్త దిశలో సాగనుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన జానపద కళలు, సాంస్కృతిక రంగాలను నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే కోహినూర్ వజ్రం లాంటిదని అన్నారు కందుల దుర్గేష్‌. ప్రతి నదికి ఒక కథ, ప్రతి కళకు ఒక ఆత్మ ఉంది. రాష్ట్రాన్ని ప్రపంచ సృజనాత్మక రాజధానిగా మార్చేందుకు అందరం కలిసి ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు.
The post సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శIPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ

IPS Suicide : హరియాణాకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య (IPS Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య, ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌

Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహంLord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం

      ఉత్తర్‌ప్రదేశ్‌ లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని యూపీ ఉప ముఖ్యమంత్రి

Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌

    ఏపీ ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌ మెక్‌ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్‌ ఎంగేజ్‌మెంట్‌ అజెండాలో ఏపీని