hyderabadupdates.com movies స్టేట్మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న శివాజీ

స్టేట్మెంట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న శివాజీ

దండోరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణ గురించి సూచనలిచ్చే క్రమంలో ఆయన కొంచెం హద్దులు దాటిపోయారు. దానిపై తీవ్ర వివాదం తలెత్తడంతో 24 గంటల్లోపే శివాజీ స్పందించాడు. తన ప్రసంగంలో అభ్యంతకర వ్యాఖ్యల విషయమై క్షమాపణ చెప్పారు.

హీరోయిన్లు బయటికి వచ్చినపుడు అనుకోని పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి తాను మంచి చెప్పాలనే ప్రయత్నంలోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు శివాజీ వివరణ ఇచ్చారు. తాను వాడిన అభ్యంతరకర పదాల గురించి ప్రస్తావించి.. అందుకు క్షమాపణ కోరుతున్నట్లు శివాజీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ‘దండోరా’ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో శివాజీ మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన అతను.. తాను వాడిన రెండు అభ్యంతరకర పదాల (సామాన్లు, దరిద్రపు ముండా) విషయంలో మాత్రమే తాను మరోసారి క్షమాపణ చెబుతున్నట్లు స్పష్టం చేశారు. వాటిని మినహాయిస్తే మిగతా వ్యాఖ్యలు అన్నింటికీ తాను కట్టుబడే ఉన్నానని ఆయన తేల్చిచెప్పారు.

ఈ విషయంలో తాను తగ్గేది లేదని, ఎవరికీ భయపడేది లేదని శివాజీ పేర్కొన్నారు. మరి శివాజీ మీద విరుచుకుపడుతున్న వాళ్లందరూ.. ఈ కండిషనల్ సారీ విషయంలో ఎలా స్పందిస్తారో చూడలి. ఇక తాను వాడిన అభ్యంతరకర పదాల విషయంలో శివాజీ మరింత వివరణ ఇస్తూ.. 30 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నానని, రాజకీయాల్లోకి కూడా వెళ్లానని.. కానీ ఏ రోజూ ఇలా అదుపు తప్పి మాట్లాడింది లేదని.. ఆ ఈవెంట్ అయిపోయాక ఇలా మాట్లాడేశానేంటి అని చాలా బాధ పడ్డానని చెప్పారు.

ఈ గొడవ వల్ల తాను 36 గంటల పాటు నిద్రపోలేదని.. ‘దండోరా’ ప్రమోషన్లకు కూడా దూరంగా ఉన్నానని.. ఐతే డబ్బులు తీసుకున్నా కాబట్టి ప్రమోట్ చేయడం తన బాధ్యత అనుకుని ఇప్పుడు ప్రెస్ మీట్లో పాల్గొన్నానని శివాజీ తెలిపారు.

“ఆ రెండు పదాలు ఎలా దొర్లాయో తెలియలేదు, వాటికి మాత్రం మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా.నేను ఇచ్చిన స్టేట్మెంట్ కు మాత్రం కట్టుబడి ఉన్నా, అందులో ఎవరికి భయపడేది లేదు.”– Actor #Shivaji pic.twitter.com/3L6JALaoLL— Gulte (@GulteOfficial) December 24, 2025

Related Post

Rajinikanth and Kamal Haasan Unite for Historic Film #Thalaivar173Rajinikanth and Kamal Haasan Unite for Historic Film #Thalaivar173

Superstar Rajinikanth is set to create history once again with his next magnum opus #Thalaivar173, produced by Ulaganayagan Kamal Haasan’s Raaj Kamal Films International and directed by the blockbuster filmmaker