hyderabadupdates.com movies స్పిరిట్ ఇచ్చింది శాంపిల్ మాత్రమే

స్పిరిట్ ఇచ్చింది శాంపిల్ మాత్రమే

నిన్న అర్ధరాత్రి న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్షణాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. ఊహించినట్టే సందీప్ రెడ్డి వంగా తన మార్క్ వయొలెన్స్ పరిచయం చేశారు. చొక్కా లేకుండా వెనుక నుంచి ప్రభాస్ గాయాలు, బ్యాండ్ ఎయిడ్స్ తో చూపిస్తూ, మందు సిగరెట్ తో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రి తనకు సిగరెట్ వెలిగిస్తున్నట్టు రివీల్ చేసిన విధానం ఆమె ప్రాధాన్యం చెప్పకనే చెబుతోంది.

మాములుగా ఇలాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ఫస్ట్ లుక్స్ ని హీరో సెంట్రిక్ గా చూపిస్తారు. కానీ ఇందులో త్రిప్తిని పొందుపరచడం చూస్తే సంథింగ్ ఇంటరెస్టింగ్ అనిపిస్తోంది.

అలాని అందరూ ఆహా ఓహో అంటున్నారని కాదు. సందీప్ వంగా ఇంకా యానిమల్, అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లో ఉన్నారని, ఇప్పుడు దాన్ని ప్రభాస్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారని కామెంట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయం ఒకటుంది.

స్పిరిట్ షూటింగ్ ఇంకా పాతిక శాతం కూడా కాలేదు. ఉన్నదాంట్లోనే బెస్ట్ లుక్ వదిలారు అంతే. అసలైన పోలీస్ ఆఫీసర్ గెటప్ బయటికి వచ్చినప్పుడు ఆన్ లైన్ మంటలు రేగడం ఖాయం. దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వంగా జస్ట్ తన ముద్ర వేసి ఈ చిన్న కానుకని అభిమానులకు ఇచ్చారు.

ఇన్ సైడ్ ప్రకారం స్పిరిట్ విడుదల ఈ ఏడాది డిసెంబర్ లోనే ఉండొచ్చు. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. కానీ రాజా సాబ్ తో పాటు ఈ సంవత్సరం ఫౌజీ కూడా వస్తుంది కాబట్టి ఒకే ఏడాది మూడు ప్రభాస్ రిలీజులు జరగడం అసాధ్యం. కాబట్టి 2027 సంక్రాంతి లేదా వేసవికి వెళ్లొచ్చనే టాక్ కూడా ఉంది.

సందీప్ వంగా ప్రస్తుతం రిలీజ్ కు సంబంధించి ఎలాంటి టార్గెట్ పెట్టుకోలేదట. ముందు ప్రభాస్ తో షూట్ మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వగైరా కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. పాటలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి ఆలస్యమైతే ఉండదు.

Related Post

విమానాలకు ‘బ్లూ స్క్రీన్’ ఎఫెక్ట్.. ఆగిపోయిన ఫ్లైట్లు!విమానాలకు ‘బ్లూ స్క్రీన్’ ఎఫెక్ట్.. ఆగిపోయిన ఫ్లైట్లు!

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో మళ్లీ గందరగోళం మొదలైంది. ప్రయాణికులు చెక్ ఇన్ చేసుకోవడానికి కౌంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఎందుకంటే, విమానాశ్రయ వ్యవస్థలను నడిపించే ‘మైక్రోసాఫ్ట్ విండోస్’ సడెన్‌గా మొరాయించింది. దీనివల్ల కంప్యూటర్లు పనిచేయక, బోర్డింగ్ పాస్‌లు ఇవ్వడం, బ్యాగేజ్ ట్యాగింగ్ చేయడం