hyderabadupdates.com movies స్పిరిట్ నుంచి ప్ర‌కాష్ రాజ్ ఔట్‌?

స్పిరిట్ నుంచి ప్ర‌కాష్ రాజ్ ఔట్‌?

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న స్పిరిట్ మీద ఏ స్థాయిలో అంచ‌నాలున్నాయో తెలిసిందే. కొత్త హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీసిన త‌న తొలి చిత్రం అర్జున్ రెడ్డితోనే సందీప్ ఎలా ప్ర‌కంప‌న‌లు రేపాడో తెలిసిందే. త‌ర్వాత బాలీవుడ్లో షాహిద్ క‌పూర్, ర‌ణ‌బీర్ క‌పూర్‌ల‌తో వారి మార్కెట్ స్థాయికి మించి చాలా పెద్ద హిట్లే ఇచ్చాడు.

అలాంటి ద‌ర్శ‌కుడు ప్ర‌భాస్ లాంటి సూప‌ర్ స్టార్‌తో సినిమా చేస్తుండ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుతాలు చూడ‌బోతున్నామ‌నే అంచ‌నాల‌తో అంద‌రూ ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న కాస్టింగ్ కూడా ఎంతో ఆస‌క్తి రేకెత్తించింది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌ను కీల‌క పాత్ర‌కు తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

గ‌త ఏడాది ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఆడియో గ్లింప్స్‌లో ప్ర‌భాస్‌తో పాటు ప్ర‌కాష్ రాజ్ వాయిస్ కూడా వినిపించింది. ఈ ఇద్ద‌రి సంభాష‌ణ సినిమాపై అంచ‌నాలు పెంచింది.

ఐతే చిత్రీక‌ర‌ణ ఆరంభ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ త‌ప్పుకొన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ద‌ర్శ‌కుడితో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ప్ర‌కాష్ రాజ్ ఈ చిత్రం నుంచి వైదొలిగాడ‌ట‌. సందీప్ రెడ్డి ఆలోచ‌న‌లు చాలా బోల్డ్‌గా, వైల్డ్‌గా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

కొన్ని సీన్లు ప‌చ్చిగా తీస్తాడు. డైలాగ్స్ కూడా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. మ‌రి ప్ర‌కాష్ రాజ్‌కు ఏ విష‌యంలో అభ్యంత‌రాలున్నాయో కానీ.. ఈ సినిమాలో తాను కొన‌సాగ‌లేన‌ని ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

యాటిట్యూడ్ చూపించే ఆర్టిస్టుల‌తో సంద‌ప్ రెడ్డి ఎలా వ్య‌వ‌హ‌రిస్తాడో.. దీపికా ప‌దుకొనే వ్య‌వ‌హార‌మ‌ప్పుడే అంద‌రికీ అర్థ‌మైంది. ముందుగా ఈ చిత్రానికి ఆమెనే హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె పెట్టిన కండిష‌న్ల‌తో త‌న‌ను త‌ప్పించి త్రిప్తి దిమ్రిని క‌థానాయిక‌గా ఎంచుకున్నాడు సందీప్.

దీపిక లాగే ప్ర‌కాష్ రాజ్ యాటిట్యూడ్ గురించి కూడా ఇండ‌స్ట్రీలో త‌ర‌చుగా చ‌ర్చ జ‌రుగుతుంటుంది. మ‌రి సందీప్, ప్ర‌కాష్ రాజ్‌ల‌కు ఏ విష‌యంలో విభేదాలు వ‌చ్చాయో.. ప్ర‌కాష్ రాజ్ స్థానంలో ఇంకెవ‌రిని సందీప్ ఎంచుకుంటాడో చూడాలి మ‌రి.

Related Post

6 Nayanthara Movies Set to Release in 2026: Toxic, Mookuthi Amman 2, Patriot and more6 Nayanthara Movies Set to Release in 2026: Toxic, Mookuthi Amman 2, Patriot and more

Cast: Nayanthara, Kavin, K. Bhagyaraj, Poornima Bhagyaraj Director: Vishnu Edavan Genre: Romantic Comedy Language: Tamil Release Date: 2026 Nayanthara teams up with Dada fame Kavin for the romantic comedy titled