hyderabadupdates.com Gallery హ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది

హ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది

హ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది post thumbnail image

గుజ‌రాత్ : ఐపీఎల్ 2026లో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జ‌రిగింది ముంబై ఇండియ‌న్స్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య‌. వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో ఓట‌మి పొందింది ముంబై . చివ‌ర‌కు జీటిపై గెలిచి ఫ్యాన్స్ కు ఊర‌ట క‌లిగించింది. ఈ మ్యాచ్ పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది. గుజ‌రాత్ టైటాన్స్ ను ఏకంగా 99 ప‌రుగుల భారీ తేడాత ఓడించింది. ఇక మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ కు దిగింది ముంబై. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 199 ర‌న్స్ చేసింది.
ప్ర‌ధానంగా ముంబై ఇండియ‌న్స్ కు చెందిన హైద‌రాబాద్ తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. క‌ళ్లు చ‌దిరే షాట్స్ తో అల‌రించాడు. త‌ను ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. 101 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవ‌లం త‌ను 45 బంతులు మాత్ర‌మే ఆడాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సులు ఉన్నాయి. త‌న‌తో పాటు న‌మ‌న్ ధీర్ 32 బాల్స్ లో 45 ర‌న్స్ చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్ద‌రూ రాణించ‌డంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది ముంబై. అనంత‌రం 200 ర‌న్స్ టార్గెట్ తో మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ర‌న్స్ కే పరిమితం అయ్యారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా బ‌రిలోకి దిగిన అశ్వ‌ని కుమార 24 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.
The post హ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తుసీఎం చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

పెనుకొండ/శ్రీసత్య సాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడితోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, తన విజనరీ నాయకత్వంతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. 76 ఏళ్ల

ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌పై బీఎస్ఎన్ఎల్ డైరెక్ట‌ర్ కు నోటీస్ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌పై బీఎస్ఎన్ఎల్ డైరెక్ట‌ర్ కు నోటీస్

న్యూఢిల్లీ : భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) డైరెక్ట‌ర్ కు బిగ్ షాక్ త‌గిలింది. ప్ర‌యాగ్ రాజ్ ప్రోటోకాల్ వివాదం పై రాద్దాంతం చోటు చేసుకుంది. ఈమేర‌కు కేంద్ర స‌ర్కార్ సీరియ‌స్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే

త‌ల్లిదండ్రులు అనాథ‌లు కాకూడ‌ద‌నే చ‌ట్టం తెచ్చాంత‌ల్లిదండ్రులు అనాథ‌లు కాకూడ‌ద‌నే చ‌ట్టం తెచ్చాం

హైద‌రాబాద్ : శాస‌న స‌భ సాక్షిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలి పోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా