హైదరాబాద్ : దర్శక, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తను ఇప్పటికే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. అష్ట కష్టాలు పడి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన దానికంటే అద్బుతంగా ఆడింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. గుండెలను హత్తుకునేలా ఉండడంతో జనం ఆదరించారు. ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజమైన కథ. ఈ సినిమా పాటలు కూడా బిగ్ హిట్ గా నిలిచాయి. సినిమా సక్సెస్ కు అస్సెట్ గా మారాయి.
తాజాగా వేణు ఉడుగుల సంచలనంగా మారాడు. తను కొత్తగా హిందీ చలన చిత్ర పరిశ్రమలోకి వెళతున్నట్లు తెలిపాడు. ఇవాళ ఆయన మీడియాతో తన కొత్త ప్రాజెక్టు గురించి పంచుకున్నాడు. ఇక హరిందర్ ఎస్ సిక్కా ప్రముఖ కథా రచయిత. తను రాసిన కాలింగ్ సెహమత్ సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇందులో అందాల తార ఆలియా భట్ నటించింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది.
ఈ చి్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర నిర్మాత వేణు ఉడుగులతో కలిసి కొత్త ప్రాజెక్టుకు పని చేయబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా వేణు ఉడుగుల మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిక్కా ఇచ్చిన కథతో నా హిందీ దర్శకత్వ రంగ ప్రవేశం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇది నిజంగా నాకు ఒక కలల ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
The post హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల
Categories: