hyderabadupdates.com Gallery హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు

హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు

హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు post thumbnail image

తిరుమ‌ల : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేద‌న్నారు. ఆ దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్ అంటూ మండిప‌డ్డారు. ఆయన పేరు ఉచ్ఛరించే అర్హత, నైతికత నీకుందా అని నిల‌దీశారు. హిందూ వ్యతిరేకి అయిన నువ్వు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు బీఆర్ నాయుడు.
అన్య మతస్తుడవైన నువ్వు ఇప్పటి వరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలిచ్చావా? రాలేదు ఎందుక‌ని, ఆ విష‌యం బ‌హిరంగంగా చెప్పాల‌న్నారు. నీ జీవితంలో నీ భార్య తో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది ఏసుప్రభువునే కానీ శ్రీ వేంకటేశ్వర స్వామిని కాదు కాబట్టి అంటూ మండిప‌డ్డారు టీటీడీ చైర్మ‌న్. తాను చైర్మ‌న్ గా కొలువు తీరాక తిరుమ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేశామ‌న్నారు. అన్య‌మ‌త ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేశామ‌న్నారు. నీ అండతో నీ బాబాయ్, భూమన చేసిన అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని నీ బాధంతా త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్న నాడే నాపై పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించావని అర్థ‌మైంద‌ని అన్నారు. అందులో భాగంగానే కదా నాపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ట దెబ్బతీయాలని చూశావంటూ ఫైర్ అయ్యారు.
The post హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసంహనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంర‌గంగ వైభ‌వోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయం ఇచ్చారు భ‌క్తుల‌కు. గజ రాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన

ఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సిందిఆనాడే జగన్ ను నిలదీసి ఉండాల్సింది

అమ‌రావ‌తి : జగన్ అవినీతి, అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచి పోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇదే విషయమై ఆనాడే జగన్ ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలదీయాల్సి

అట్లీ స్పెషల్‌ సాంగ్‌!అట్లీ స్పెషల్‌ సాంగ్‌!

అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా కోసం బన్నీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌కు ప్రత్యేకంగా ప్లాన్ జరుగుతోంది. ఆ పాట కోసం