hyderabadupdates.com movies హిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగే

హిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగే

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాలకు లోటు లేదు. ఆఫర్లు వస్తున్నాయి. ఏ ముహూర్తంలో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఛాన్స్ ఇచ్చాడో కానీ అది డిజాస్టర్ అయినా సరే అమ్మడికి మాత్రం దశ తిరిగింది. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు తనవైపు చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ కింగ్డమ్ దొరికింది. భారీ బడ్జెట్ తో సితార సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఫ్లాప్ ముద్ర పడింది. తాజాగా విడుదలైన దుల్కర్ సల్మాన్ కాంత సైతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తమిళంలో ఓకే అనిపించుకున్నా తెలుగులో మాత్రం నిరాశపరిచింది.

ఇప్పుడు ఇదే నెలలో రామ్ తో కలిసి ఆంధ్రకింగ్ తాలూకాలో భాగ్యశ్రీ బోర్సే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్ చూస్తే నమ్మకం పెట్టుకోవచ్చు అనేలాగే ఉంది. రామ్, ఉపేంద్రల మధ్య ఫ్యాన్ హీరో ఎమోషన్ తీసుకున్న దర్శకుడు మహేష్ బాబు ఏదో కొత్త ప్రయత్నమైతే చేశాడు. సంగీత దర్శకులు వివేక్ మెర్విన్ పాటలు మెల్లగా చొచ్చుకుపోతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత రామ్ ఎనర్జీ పూర్తి స్థాయిలో తెరమీద కనిపిస్తోందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కథ పరంగా ఆంధ్రకింగ్ ఉపేంద్ర అయినప్పటికీ తాలూకా అనే పదం రామ్ ని ఉద్దేశించిందే. తన పాత్రే హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఇక భాగ్యశ్రీ బోర్సేకు తగిన ప్రాధాన్యం దక్కిందని, రామ్ పోషించిన సాగర్ పాత్రకు ఆమెకు మధ్య పెట్టిన లవ్ స్టోరీ కథలో కీలక భాగం పోషిస్తుందట. దీని సక్సెస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్న భాగ్యశ్రీకి కాంత ఫలితం నిరాశపరిచిన మాట వాస్తవం. కాకపోతే అందులో ఫస్ట్ హాఫ్ కే హత్యకు గురయ్యే క్యారెక్టర్ అయినప్పటికీ ఉన్నంతలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ అవకాశం కలిగించాడు. కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ అందం అభినయం రెండూ ఉన్న నటిగా తన గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. మరి హిట్టు భాగ్యం ఆంధ్రకింగ్ కలిగిస్తాడో లేదో చూడాలి.

Related Post

వెంకటేష్ సినిమా పేర్లు… అభిమానుల్లో డౌట్లువెంకటేష్ సినిమా పేర్లు… అభిమానుల్లో డౌట్లు

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కబోయే సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్లకు డైలాగులు రాసిన మాటల మాంత్రికుడు మొదటిసారి డైరెక్టర్ గా తమ