hyderabadupdates.com movies హిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగే

హిట్టు ‘భాగ్యం’ ఇవ్వాల్సింది ఆంధ్రకింగే

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాలకు లోటు లేదు. ఆఫర్లు వస్తున్నాయి. ఏ ముహూర్తంలో దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఛాన్స్ ఇచ్చాడో కానీ అది డిజాస్టర్ అయినా సరే అమ్మడికి మాత్రం దశ తిరిగింది. పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు తనవైపు చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ కింగ్డమ్ దొరికింది. భారీ బడ్జెట్ తో సితార సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఫ్లాప్ ముద్ర పడింది. తాజాగా విడుదలైన దుల్కర్ సల్మాన్ కాంత సైతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. తమిళంలో ఓకే అనిపించుకున్నా తెలుగులో మాత్రం నిరాశపరిచింది.

ఇప్పుడు ఇదే నెలలో రామ్ తో కలిసి ఆంధ్రకింగ్ తాలూకాలో భాగ్యశ్రీ బోర్సే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్ చూస్తే నమ్మకం పెట్టుకోవచ్చు అనేలాగే ఉంది. రామ్, ఉపేంద్రల మధ్య ఫ్యాన్ హీరో ఎమోషన్ తీసుకున్న దర్శకుడు మహేష్ బాబు ఏదో కొత్త ప్రయత్నమైతే చేశాడు. సంగీత దర్శకులు వివేక్ మెర్విన్ పాటలు మెల్లగా చొచ్చుకుపోతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత రామ్ ఎనర్జీ పూర్తి స్థాయిలో తెరమీద కనిపిస్తోందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కథ పరంగా ఆంధ్రకింగ్ ఉపేంద్ర అయినప్పటికీ తాలూకా అనే పదం రామ్ ని ఉద్దేశించిందే. తన పాత్రే హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఇక భాగ్యశ్రీ బోర్సేకు తగిన ప్రాధాన్యం దక్కిందని, రామ్ పోషించిన సాగర్ పాత్రకు ఆమెకు మధ్య పెట్టిన లవ్ స్టోరీ కథలో కీలక భాగం పోషిస్తుందట. దీని సక్సెస్ మీద చాలా నమ్మకం పెట్టుకున్న భాగ్యశ్రీకి కాంత ఫలితం నిరాశపరిచిన మాట వాస్తవం. కాకపోతే అందులో ఫస్ట్ హాఫ్ కే హత్యకు గురయ్యే క్యారెక్టర్ అయినప్పటికీ ఉన్నంతలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ అవకాశం కలిగించాడు. కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ అందం అభినయం రెండూ ఉన్న నటిగా తన గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. మరి హిట్టు భాగ్యం ఆంధ్రకింగ్ కలిగిస్తాడో లేదో చూడాలి.

Related Post

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారువరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది. పండగ మూడ్ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు, సెలవులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరికి వారు బిజీ కావడంతో థియేటర్లు

Get Ready To Witness Ranveer Singh As A One-Man Army In “Dhurandhar”!Get Ready To Witness Ranveer Singh As A One-Man Army In “Dhurandhar”!

From the makers of Uri: The Surgical Strike (2019), another patriotic movie makes its way to the Bollywood big screens on December 5, 2025. Titled “Dhurandhar”, translated as “Stalwart”, it