hyderabadupdates.com movies హీరోయిన్ల కాస్ట్లీ డ్రెస్సుల వెనుక మ‌ర్మం

హీరోయిన్ల కాస్ట్లీ డ్రెస్సుల వెనుక మ‌ర్మం

ఏదైనా సినిమా ఈవెంట్ జ‌రిగిందంటే.. దానికి హాజ‌ర‌య్యే హీరోయిన్లు డిజైన‌ర్ డ్రెస్సుల‌తో హాజ‌ర‌వుతారు. వాటి ధ‌ర ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఆ డ్రెస్సుల్లో హీరోయిన్లు క‌నిపిస్తారు. ఒక్క ఈవెంట్ కోసం అంత ఖ‌రీదైన డ్రెస్సేంటి అని సామాన్య జ‌నానికి ఆశ్చ‌ర్యం క‌లుగుతుంటుంది. వీటిని ఎవ‌రు స్పాన్స‌ర్ చేస్తారు.. అవి అద్దెకు తెస్తారా? లేక కొంటారా? కొనేట్ల‌యితే అవి హీరోయిన్ల‌కే సొంత‌మా? లేక నిర్మాణ సంస్థకు చెందుతుందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతుంటాయి. వీటికి స్టైలిష్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ నీర‌జ కోన ఒక ఇంట‌ర్వ్యూలో స‌మాధానం ఇచ్చింది.

హీరోయిన్లు వేసుకునే ల‌గ్జ‌రీ డ్రెస్సుల‌ను కాస్ట్యూమ్ డిజైన‌ర్లే స్పాన్స‌ర్ చేస్తార‌ని ఆమె వెల్ల‌డించింది. త‌మ డిజైన్ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి కాస్ట్యూమ్ డిజైన‌ర్ల‌కు సినిమా ఈవెంట్ల‌కు మించిన వేదిక మ‌రొక‌టి ఉండ‌ద‌ని ఆమె తెలిపింది. అందుకే హీరోయిన్ల ద్వారా త‌మ డిజైన్స్‌ను ప్ర‌మోట్ చేసుకుంటార‌ని నీర‌జ చెప్పింది.

ఒక‌సారి డిజైన‌ర్ డ్రెస్‌ను ఎగ్జిబిట్ చేశాక‌.. వాటిని హీరోయిన్లే సొంతం చేసుకుంటార‌ని.. ఆ డ్రెస్‌ను ప్ర‌మోట్ చేసినందుకు అది వారికిచ్చే బ‌హుమ‌తి అని నీర‌జ తెలిపింది. ఈ ఎగ్జిబిట్ చేశాక ఆ డ్రెస్ డిజైన‌ర్స్ ఆ మోడ‌ల్‌ను రీల్స్, షార్ట్స్ ద్వారా ప్ర‌మోట్ చేస్తార‌ని.. క‌స్ట‌మ‌ర్లు అలాంటి డిజైన్ కావాల‌ని వాటిని ఆర్డ‌ర్ చేస్తార‌ని.. వెడ్డింగ్ ఈవెంట్ల‌కు ఎక్కువ‌గా ఇలాంటి ఆర్డ‌ర్స్ వ‌స్తాయ‌ని.. ఈ ర‌కంగా వారికి బిజినెస్ జ‌రుగుతుంద‌ని నీర‌జ తెలిపింది.

ఇక టాలీవుడ్లో స్టైలింగ్ ప‌రంగా త‌న‌కు న‌చ్చే హీరోల గురించి నీర‌జ మాట్లాడింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర్జున్ స్టైలింగ్ చాలా బాగుంటుంద‌ని ఆమె చెప్పింది. నాని చాలా సింపుల్, క్యాజువ‌ల్ డ్రెస్సుల‌తోనే ఎఫ‌ర్ట్ లెస్‌గా స్టైల్‌గా క‌నిపిస్తాడ‌ని.. అత‌ను చాలా స్పెష‌ల్ అని ఆమె అభిప్రాయ‌ప‌డింది. టాలీవుడ్లో కొంద‌రు హీరోలు స్టైలింగ్ విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటార‌ని.. ఒక హీరోకు తాను 800 డాల‌ర్లు పెట్టి టీ ష‌ర్ట్ కొన్నాన‌ని.. కొంద‌రు ఇలా ఖ‌రీదైన స్టైలింగ్ కోరుకుంటార‌ని ఆమె తెలిపింది. ఇన్నాళ్లూ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గానే ఉన్న నీర‌జ‌.. ద‌ర్శ‌కురాలిగా మారి రూపొందించిన తెలుసు క‌దా ఈ నెల 17న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

Related Post