నల్లగొండ జిల్లా : హుజుర్ నగర్ , కోదాడ నియోజక వర్గాల రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు పట్టుబట్టి సింగిల్ లైన్ రోడ్లను ను డబుల్ లైన్ రోడ్లు గా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. ఇందుకు గాను పాలనా పరమైన అనుమతులతో పాటు ప్రభుత్వం ఏక కాలంలో మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ (MDR) కింద 130 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
.
హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో రూ.62 కోట్లతో 26.50 KM ల పొడవున డబల్ రోడ్డు మంజూరు పనులకు ఆమోదం తెలిపింది. తద్వారా ఈ నియోజకవర్గంలో 15 గ్రామాలకు ప్రయాణ సౌకర్యం సులువుగా మారనుంది. అదేవిధంగా కోదాడ నియోజకవర్గ పరిధిలో రూ.68 కోట్లతో 22.60 KM ల పొడవున డబల్ రోడ్డు ఏర్పాటుకు పాలనా పరమైన అనుమతులు లభించాయి. తద్వారా నియోజకవర్గంలోని 9 గ్రామాలకు రాక పోకలు సులువు కానున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురనగర్, కోదాడ నియోజకవర్గాల పరిధి లోని సుమారు 49.10 KMల మేర సింగిల్ లైన్ రోడ్డును డబల్ లైన్ రోడ్డుగా మార్చేందుకు మార్చి 5 న ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో రూ.32 కోట్లతో చింతలపాలెం నుండి కిస్టాపురం వరకు 9.20 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీంతో చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు, కిస్టాపురం గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా రామలక్ష్మిపురం నుండి హుజూర్ నగర్ బైపాస్ రోడ్డు వరకు 3.80 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీంతో రామలక్ష్మిపురం, యర్రారం , హుజూర్ నగర్ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
రూ.30 కోట్లతో అమరవరం నుండి కొత్త తండ వరకు 5.50 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. అమరవరం, అంజలిపురం తండ, కొత్తతండ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గుడుగుంట్ల పాలెం నుండి ఎల్లాపురం వరకు 8.00 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. గుడుగుంట్ల పాలెం, ముసిఒడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. కోదాడ నియోజకవర్గం పరిధిలో రూ.30 కోట్లతో కోదాడ నుండి అనంతగిరి వరకు 6.60 KMల మేర ఏడు మీటర్ల నుండి పది మీటర్ల మేర వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కోదాడ, ఖానాపురం, అనంతగిరి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
రూ.24 కోట్లతో NH9 నుండి నేలమర్రి వరకు 10.00 KMల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో తాడ్వాయి తండ, తాడ్వాయి, వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అదే విదంగా రూ.14 కోట్లతో కాపుగల్లు నుండి దోరకుంట వరకు 6.00 KMల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. కాపుగల్లు, దోరకుంట ప్రజలకు లబ్ధి చేకూరుతుంది . ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తక్షణమే టెండర్లు పిలిచి యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.
The post హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
Categories: