hyderabadupdates.com Gallery హైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదా

హైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదా

హైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదా post thumbnail image

హైద‌రాబాద్ : అంత‌రిక్ష ఆధారిత సాంకేతికతను వినియోగించి ప్రజా ఆస్తులతో పాటు సరస్సులను రక్షించేందుకు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చేస్తున్న‌ కృషిని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు అభినందించారు. ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్ట‌ర్ డా. ప్ర‌కాష్ చౌహాన్‌, ఇస్రో మాజీ ఛైర్మెన్ ఏఎస్ కిర‌ణ్ కుమార్‌తో పాటు ప‌లువురు హైద‌రాబాద్ లో జ‌రిగిన స‌ద‌స్సులో మాట్లాడారు. చెరువులు, పార్కులు కాపాడ‌డంలో హైడ్రాకు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ సెంట‌ర్లో శాస్త్ర‌వేత్త‌ల స‌మ‌క్షంలో “హైడ్రా-రక్ష” పౌర కేంద్రిత పోర్టల్ ప్రారంభ‌మైంది. ఓ ఆర్ ఆర్ ప‌రిధిలోని చెరువులు, నాలాల హ‌ద్దుల‌తో పాటు.. భూముల వివ‌రాలు తెలుసు కునేందుకు హైడ్రా – ర‌క్ష‌ పోర్ట‌ల్ ఉప‌యోగ ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.
చెరువులు, ప్ర‌భుత్వ భూముల‌తో పాటు ప్ర‌జా అవ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలను ప్ర‌జ‌లు కొని మోస పోకుండా స‌రైన స‌మాచారం ఈ పోర్ట‌ల్ ద్వ‌రా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుందని వెల్ల‌డించారు శాస్త్ర‌వేత్త‌లు. కొంటున్న ప్లాట్లు చెరువుల చెంత ఉన్నాయా, లేక‌ నాలాల బ‌ఫ‌ర్‌లోనివా అనేది తెలుసు కోవ‌డానికి వీలు కుదురుతుంద‌ని చెప్పారు. జిల్లా / మండలం / గ్రామం, సరస్సు పేరుతో పాటు భౌగోళిక సమన్వయాలు (Geographic Coordinates) ఈ పోర్ట‌ల్‌లో ఎంట‌ర్ చేస్తే సంబంధిత ప్రాంతం ఆటోమేటిక్‌గా జూమ్ అవుతుందని స్ప‌ష్టం చేశారు. ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులు, బఫర్ జోన్‌లు తెలుస్తాయని అన్నారు. “హైడ్రా-రక్ష” పోర్టల్‌ను మొదట్లో కొన్ని వారాల వ‌ర‌కూ హైడ్రా అంతర్గత వినియోగానికి మాత్రమే వినియోగిస్తుందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వ‌స్తుందన్నారు.
The post హైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

    బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌

గ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగిగ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి

దుబాయ్ : భార‌త దేశానికి చెందిన రూబుల్ నాగి సంచ‌ల‌నంగా మారారు. త‌ను దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్రమంలో అత్యుత్త‌మమైన ఉపాధ్యాయురాలి పుర‌స్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భారతీయ

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తిSupreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court : దిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court) ఏప్రిల్‌ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం