hyderabadupdates.com Gallery హైడ్రా ఫోన్ ఇన్‌కు 28 కాల్స్ : క‌మిష‌న‌ర్

హైడ్రా ఫోన్ ఇన్‌కు 28 కాల్స్ : క‌మిష‌న‌ర్

హైడ్రా ఫోన్ ఇన్‌కు 28 కాల్స్ : క‌మిష‌న‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని చెరువుల్లోకి మురుగు నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. చెరువులు దుర్గంధ భ‌రితంగా మారాయి. గుర్ర‌పు డెక్క వ్యాపించి దోమ‌ల‌కు కేంద్రాలుగా న‌గ‌రంలోని చెరువులు మారాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల జాబితాలో మా ప్రాంత చెరువును కూడా చేర్చాల‌ని హైడ్రా నిర్వ‌హించిన ఫోన్ ఇన్ కార్య‌క్ర‌మంలో న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి విన్నాపాలు వ‌చ్చాయి. చెరువులు, నాలాలు ఆక్ర‌మ‌ణ‌కు గురి కాకుండా చూసి వ‌ర‌ద‌లు నివారించాల‌ని ప‌లువురు విజ్ఞ‌ప్తి చేశారు 28 మందితో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ నేరుగా మాట్లాడారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. మురుగు నీరు క‌ల‌వ‌కుండా ఎస్‌టీపీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. రామంతాపూర్ చిన్న చెరువు ఎప్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని వెంట‌నే వీటిని ఆపి చెరువును కాపాడాల‌ని స్థానికంగా ఉన్న ఓ మ‌హిళ ఫోను చేసి కోరారు. బాచుప‌ల్లి స‌ర్వే నంబ‌రు 54 లో 3 ఎక‌రాల వ‌ర‌కూ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో ఉందని, దీనిని ప్ర‌జావ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని మ‌రో వ్య‌క్తి కోరారు.
ఓల్డ్ అల్వాల్‌, జొన్న‌బండ‌లోని వ‌జ్ర ఎన్‌క్లేవ్‌లో పార్కుల ఆక్ర‌మ‌ణ‌తో పాటు ర‌హ‌దారి ఆటంకాల‌ను తొల‌గించాల‌ని అక్క‌డి కాల‌నీ ప్ర‌తినిధులు కోరారు, ఎల్‌బీన‌గ‌ర్‌లోని వాంబే ఇళ్లు పొందిన కింది పోర్ష‌న్ వారు వాహ‌నాల‌కు పార్కింగ్ కోసం ఉంచిన స్థ‌లాల‌ను క‌లిపి అద‌న‌పు గ‌దులు నిర్మిస్తున్నార‌ని, వెంట‌నే వాటిని తొల‌గించి నివాసితుల అంద‌రి వినియోగంలోకి తీసుకు రావాల‌ని కోరారు. హెచ్ఏఎల్ కాల‌నీలోని ఖ‌ర్మ‌న్‌కుంట‌లో మురుగు నీరు చేరి గుర్ర‌పు డెక్క పెరుగుతుంది అభివృద్ధి చేయాల‌ని సూచించారు. నిజాంపేట‌లోని హిల్‌కౌంటీలో ప‌త్తికుంట‌కు నాలుగు వైపులా ర‌హ‌దారులున్నాయని , దుర్గంధంతో నిండిన ఈ చెరువును అభివృద్ధి చేస్తే అంద‌రికీ వినియోగంలోకి వ‌స్తుంద‌న్నారు. న‌ల్ల‌గండ్ల‌లోని న‌ల్ల‌గండ్ల చెరువును అభివృద్ధి చేయాల‌ని కోరారు. లోయ‌ర్ ట్యాంక్‌బండ్ వ‌ద్ద తెలంగాణ ప‌ర్యాట‌కాభివృద్ధి సంస్థ‌కు ఉద్దేశించిన భూమిలో అక్ర‌మ పార్కింగ్ దందా కొన‌సాగుతోంద‌ని ఫిర్యాదు చేశారు.
The post హైడ్రా ఫోన్ ఇన్‌కు 28 కాల్స్ : క‌మిష‌న‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి

న్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణన్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణ

అమ‌రావ‌తి : కొత్త సాంకేతిక‌త‌తో రైతుల భూముల‌కు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ

నారా లోకేష్ ప్ర‌తిపాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఆలంబ‌ననారా లోకేష్ ప్ర‌తిపాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఆలంబ‌న

అమ‌రావ‌తి : దావోస్ లో ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇదేక్ర‌మంలో వ‌ర‌ల్డ్ లోనే