hyderabadupdates.com movies హైదరాబాదీయులకు స్వీట్ న్యూస్.. మెస్సీ వచ్చేస్తున్నాడు

హైదరాబాదీయులకు స్వీట్ న్యూస్.. మెస్సీ వచ్చేస్తున్నాడు

ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి. ఈ అర్జెంటీనా క్రీడాకారుడు ఫుట్ బాల్ క్రీడను అభిమానించే వారికి ఒక దేవుడిగా కొలుస్తారు. 5 అడుగుల 7 అంగుళాలు ఉండే మెస్సీకి సంబంధించిన విశేషాలు అన్ని ఇన్ని కావు. అతడి జీవితాన్ని చూస్తే.. సినిమాటిక్ గా ఉంటుంది. చిన్నతనంలోనే అరుదైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొని.. వాటిని అధిగమించటం ఒక ఎత్తు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకోవటం మరో ఎత్తు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అతడి ఒంటి మీద ఉండే పదిహేను టాటూలు.. వాటి వెనుక ఉన్న స్టోరీల్ని విన్నప్పుడు మెస్సీ మీద అమాంతం ప్రేమ పుట్టుకు వస్తుంది. అన్నింటికి మించి అతడు మొదట తన వీపు ఒక వైపు వేయించుకున్న తన తల్లి ముఖం టాటూ.. తన బిడ్డల టాటూలు చూసినప్పుడు అతడెంత ఫ్యామిలీ మెన్ అన్నది అర్థమవుతుంది. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. దిగ్గజ డైరెక్టర్ రాజమౌళికి.. మెస్సీకి ఒక లింకు ఉంది. జక్కన్న మాదిరే మెస్సీ ఫ్యామిలీ మొత్తం ఆయనకు పని చేస్తూ ఉంటుంది. తాను తీసే సినిమాలకు సంబంధించిన చాలా వ్యవహారాలు ఆయన కుటుంబ సభ్యులే చూసుకోవటం తెలిసిందే. చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లాడిన మెస్సీకి ఇద్దరు పిల్లలు.

మెస్సీ తండ్రి జార్జ్ అతడికి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ అతడి వ్యాపార విషయాలన్నీ చూసుకుంటారు. అతని పెద్ద సోదరుడు రోడ్రిగో మెస్సీ రోజువారీ షెడ్యూల్, ప్రచార పనుల్ని చూసుకుంటారు. అతని తల్లి, మరో సోదరుడు మాతియాస్ లు మాత్రం మెస్సీ స్వచ్ఛంద సంస్థ ‘లియో మెస్సీ ఫౌండేషన్‌’ వ్యవహరాల్ని పర్యవేక్షిస్తుంటారు. మెస్సీ సతీమణి మరియు రోసారియోలో అతడి వ్యక్తిగత అంశాలతో పాటు వృత్తిపరమైన విషయాలను చూసుకుంటారు.

మెస్సీ ఇండియా టూర్ గురించి ఇప్పటికే ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న మార్పు.. అతడి ట్రిప్ లో హైదరాబాద్ మహానగరాన్ని కూడా సందర్శించనున్నాడు. దేశంలోని ప్రధాన నగరాలకు వస్తున్న మెస్సీ.. తొలుత హైదరాబాద్ వచ్చే షెడ్యూల్ లేదు. దక్షిణాదిన కేరళ నగరాన్ని మాత్రమే సందర్శించేలా షెడ్యూల్ చేశారు. అయితే.. ఆ వేదిక రద్దు కావటంతో మెస్సీని హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నం ఫలించింది.

ఇక.. అతడి షెడ్యూల్ ను చూస్తే.. డిసెంబరు 12 అర్థరాత్రి లేదంటే 13 తెల్లవారుజామున లియోనెల్ మెస్సి కోల్ కతా చేరుకుంటారు. సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసే ప్రోగ్రాంలో పాల్గొంటారు. డిసెంబరు 13 సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఏ వేదిక మీద అభిమానుల్ని కలుసుకుంటారు? అన్నది ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. డిసెంబరు 14న ముంబయి.. డిసెంబరు 15న ఢిల్లీలో పర్యటిస్తారు. అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు. దీంతో.. మెస్సీ భారత ట్రిప్ పూర్తి కానుంది.

Related Post

లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!లండ‌న్ టూర్‌.. చంద్ర‌బాబు కీల‌క భేటీ!

లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం.. కీల‌క భేటీ నిర్వ‌హించారు. లండ‌న్‌లోని భార‌త హైక‌మిష‌న‌ర్ (ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారి)తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల‌కుపైగా సాగిన ఈ బేటీలో ప‌లు కీల‌క విష‌యాల‌పై