టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు 100 కోట్ల షేర్ అనేది ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. ఒకప్పుడు 50 కోట్లు వస్తేనే గొప్ప అనుకునేవాళ్లం, కానీ ఇప్పుడు మార్కెట్ రేంజ్ పెరగడంతో స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల షేర్ అనేది మినిమం టార్గెట్ అయిపోయింది.
రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కూడా ఈ క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. అయితే ఈ లిస్ట్‌లో అందరు స్టార్లు ఉన్నా, ఇద్దరు సీనియర్ హీరోల పేర్లు లేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం 100 కోట్ల షేర్ క్లబ్‌లో చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు పక్కాగా ఉన్నారు. ఆశ్చర్యకరంగా యంగ్ హీరో తేజ సజ్జ ‘హనుమాన్’ సినిమాతో, సీనియర్ హీరో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఈ మార్కును దాటేశారు.
ప్రభాస్ తన ‘ది రాజాసాబ్’ సినిమాతో మిక్స్డ్ టాక్ లోనూ భారీ వసూళ్లు రాబట్టి ఈ క్లబ్‌లో మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇంకా ఈ ఫీట్ సాధించాల్సి ఉంది.
బాలకృష్ణ కెరీర్‌లో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ ఉన్నప్పటికీ, అవి 100 కోట్ల షేర్ మార్కుకు దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన అఖండ 2 రికార్డ్ సెట్ చేస్తుంది అనుకున్నా, సాధ్యం కాలేదు. అయితే బాలయ్య మాస్ పవర్ కు ఒక్క సరైన కమర్షియల్ బొమ్మ పడితే ఈ 100 కోట్ల మార్క్ పెద్ద లెక్కేం కాదు. కానీ ఇప్పటివరకైతే ఆ రికార్డ్ ఆయన ఖాతాలో పడలేదు.
ఇక కింగ్ నాగార్జున పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ‘సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు వంటి సంక్రాంతి హిట్స్ ఆయనకు ఉన్నా, అవి 50 నుండి 70 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయాయి. గతంలో సంక్రాంతికి వచ్చిన ‘నా సామిరంగ’ పర్వాలేదనిపించినా, భారీ వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. నాగ్ తన తదుపరి సినిమాలతోనైనా ఈ మ్యాజికల్ ఫిగర్ అందుకుంటారని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మార్కెట్ పెరుగుతున్నా ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు ఈ క్లబ్ ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది.
బాక్సాఫీస్ వద్ద ఇప్పుడున్న పోటీలో 100 కోట్ల షేర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. థియేటర్ల కౌంట్, టికెట్ రేట్లు పెరగడంతో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు స్టార్లు కూడా ఈ క్లబ్‌లోకి ఎంటర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం కంటెంట్ క్లిక్ అయితే చాలు, రికార్డులు వాటంతట అవే వస్తాయి. మరి బాలయ్య, నాగ్ లలో ఎవరు ముందుగా ఈ 100 కోట్ల మార్కును టచ్ చేస్తారో చూడాలి.