hyderabadupdates.com movies 100 కోట్ల హీరో… ముందే హింట్ ఇచ్చాడు

100 కోట్ల హీరో… ముందే హింట్ ఇచ్చాడు

ఏ బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త కుర్రాడు.. లుక్స్ పరంగా చూస్తే హీరోలా అనిపించడు.. అలాంటోడు తొలి చిత్రంతోనే వంద కోట్ల వసూళ్లు మార్కును అందుకోవడం అనూహ్యం అంటే.. తర్వాతి రెండు చిత్రాలు కూడా ఆ ఘనతను చేరుకోవడం ఫిలిం ఇండస్ట్రీకి మామూలు షాక్ కాదు. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్ ఈ మైండ్ బ్లోయింగ్ ఫీటే సాధించాడు.

నిజానికి అతను స్వతహాగా నటుడు కాదు. ‘కోమాలి’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రదీప్. తర్వాత తన దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘లవ్ టుడే’తో హీరోగా మారాడు. ఆ చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. హీరోగా అవకాశాలు వరుస కట్టాయి. డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు కూడా మంచి ఫలితాన్నందుకుని ప్రదీప్‌కు మాంచి క్రేజ్, మార్కెట్ తెచ్చిపెట్టాయి.

ఐతే వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు ఇవ్వడం అతడి మీద విపరీతమైన ఒత్తిడిని తెచ్చిపెట్టాయి. తన తర్వాతి సినిమా కూడా ఇదే రేంజిలో ఆడుతుందని ట్రేడ్ అంచనాలు పెట్టుకుంది. కానీ నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితాన్ని ఎదుర్కొంది. 

తమిళంలో జస్ట్ ఫ్లాప్ అయిన ఈ చిత్రం.. తెలుగులో డిజాస్టర్ అయింది. ప్రదీప్ ఇప్పటిదాకా చేసిన వాటిలో ఏ సినిమా వసూళ్లలోనూ సగం కూడా ‘ఎల్ఐకే’ సాధించిన సంకేతాలు కనిపించడం లేదు. దీని బడ్జెటేమో మిగతా మూడు చిత్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ. కాబట్టి బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఇది డిజాస్టరే.

ఐతే ‘ఎల్ఐకే’ ఇలాంటి ఫలితాన్ని అందుకుంటుందని ప్రదీప్ కు ముందే అర్థం అయిపోయిందేమో.. రిలీజ్ ముంగిట అతను ఒక కామెంట్ చేశాడు. తన మొదటి మూడు చిత్రాల వంద కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో తర్వాతి సినిమాకి కూడా అదే కలెక్షన్ అంచనా వేస్తున్నారని, అది తన మీద ఒత్తిడి పెంచుతోందని అతన్నన్నాడు.

ఒకవేళ ఎల్ఐకే వంద కోట్ల కలెక్ట్ చెయ్యకపోతే దీన్ని ఫెయిల్యూర్ అంటారేమో అని.. కానీ తన దృష్టిలో సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్నదే ముఖ్యమని, దాన్ని బట్టే దాని ఫలితాన్ని అంచనా వేస్తానని అన్నాడు ప్రదీప్. ఈ కామెంట్స్ చేసినపుడే అతడికి ఈ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ అవుతుందని నమ్మకం లేదనే సందేహాలు కలిగాయి.

రిలీజ్ తర్వాత ఆ అనుమానాలే నిజమయ్యాయి. కలెక్షన్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు అన్నది స్పష్టం. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది ఫెయిల్యూరే. ఈ మూవీ ప్రదీప్ మార్కెట్ ను దెబ్బ కొట్టిందా.. ఇది తన సత్తాకు పరీక్షనా అంటే ఇప్పుడు ఏమి చెప్పలేం. ఇంకో కంటెంట్ ఉన్న సినిమా చేస్తే ప్రదీప్ మళ్ళీ వంద కోట్ల కలెక్షన్ కొట్టే అవకాశాలను కొట్టి పారేయలేం.

Related Post

Chiranjeevi & Venkatesh Set the Festive Mood With a Power-Packed TrailerChiranjeevi & Venkatesh Set the Festive Mood With a Power-Packed Trailer

The theatrical trailer of Mana Shankara Vara Prasad Garu has been unveiled in Tirupati, instantly raising excitement among fans and family audiences alike. Headlined by Chiranjeevi and directed by Anil