hyderabadupdates.com movies 11 రూపాయల టికెట్లు రాంగా రైటా

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల ప్రభావమో అంతు చిక్కని పరిస్థితుల్లో తల బద్దలు కొట్టుకుంటుంటే అప్పుడప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటివి సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ కొట్టి ఎంతో మంది ప్రొడ్యూసర్లకు స్ఫూర్తినిస్తున్నాయి.

కానీ ఇది అందరి విషయంలో జరగకపోవడమే అసలు ట్రాజెడీ. మార్కెటింగ్ చేసినా చేయకపోయినా జనాలతో టికెట్లు కొనిపించడం పెద్ద సవాల్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన నిలవే టీమ్ ఒక అడుగు ముందుకు వేసి ఊహించని రీతిలో స్ట్రాటజీ వేసింది.

హైదరాబాద్ లోని ఒక సింగల్ స్క్రీన్ లో సాయంత్రం, నైట్ షోలు రెండింటికి కేవలం 11 రూపాయలు టికెట్ ధర పెట్టడం మూవీ లవర్స్ ని షాక్ కి గురి చేసింది. మాములుగా గివ్ ఆవె పేరుతో సోషల్ మీడియాలో ఉచితంగా టికెట్లు ఇచ్చే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే అవి బుక్ మై షోలో ఉండవు.

ఇన్ ఫ్లూయెన్సర్లు పెట్టే కండీషన్లు ఫాలో అయిపోయి వాళ్లకు సంతృప్తి అనిపించే లక్కీ విన్నర్స్ కు మాత్రమే వాటిని అందజేస్తారు. కానీ ఈ పదకొండు రూపాయల స్కీంలో ఆ బాధ లేదు. డైరెక్ట్ గా బుక్ మై షోలో బుక్ చేసుకుని వెళ్లిపోవచ్చు. ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకో కోణం కూడా వైపు కూడా చూడాలి.

గత ఏడాది రాజు వెడ్స్ రాంబాయికి 99 రూపాయలు టికెట్ పెడితేనే కొందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఈ పదకొండు రూపాయల పధకానికి ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.

ఇది కాసేపు పక్కనపెడితే మరీ ఇంత తక్కువ కాదు కానీ చిన్న సినిమాలకు ఇకపై యాభై నుంచి వంద మధ్యలో టికెట్ ధరలు ఉండేలా పరిశ్రమ పూనుకుంటే మంచి ఫలితాలు చూడొచ్చు. ప్యాన్ ఇండియా మూవీస్ కి ముక్కు పిండి నాలుగు వందలు తీసుకున్నప్పుడు వాటి బడ్జెట్ తో పది శాతం కూడా ఉండని వాటికి డిస్కౌంట్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఆ దిశగా ఆలోచించాల్సింది ప్రభుత్వాలు, ఇండస్ట్రీ పెద్దలే.

Related Post

బాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాం: కేంద్రంబాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాం: కేంద్రం

ఏపీ సీఎం చంద్ర‌బాబును మెచ్చుకోకుండా ఎలా ఉంటాం.. అని కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, అశ్వినీ వైష్ణ‌వ్‌లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు భిన్నంగా ఆలోచ‌న‌లు చేస్తార‌ని ప్ర‌శంస‌లు గుప్పించారు. ‘భార‌త్ ఏఐ శ‌క్తి’ పేరుతో ఢిల్లీలో నిర్వ‌హించిన

140 ఏళ్ల కాంగ్రెస్‌: దేశంలో సంద‌డి ఏది?140 ఏళ్ల కాంగ్రెస్‌: దేశంలో సంద‌డి ఏది?

జాతీయ కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్యోద్య‌మం నుంచి నేటి వ‌ర‌కు కూడా అనేక ఉత్థాన ప‌త‌నాలు ఎదుర్కొన్న పార్టీ ఇది. అతి పురాత‌న పార్టీనే అయినా.. ఒక‌ప్పుడు న‌వ‌న‌వోన్మేషంగా ముందుకు సాగింది. అయితే.. 2014 త‌ర్వాత‌.. దిగంతాల నుంచి దిగులు దిగులుగా.. దిగ‌జారుతున్న