hyderabadupdates.com Gallery 14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ

14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ

14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాల‌యాల‌కు పెద్ద ఎత్తున బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెష‌ల్ బ‌స్సులు కేటాయించామ‌న్నారు . ఈ బ‌స్సులు ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వ‌ర‌కు న‌డుస్తాయ‌న్నారు. ఇందులో భాగంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 స్పెషల్ సర్వీసులు న‌డిపిస్తామ‌న్నారు ఎండీ. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింద‌న్నారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింద‌న్నారు. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా మూడు రోజుల వరకు ఈ ప్రత్యేక బస్సులను న‌డిపిస్తామ‌న్నారు సీఎం.
అంతే కాకుండా కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామ‌న్నారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కె.పి.హెచ్.బి, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించిందన్నారు. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించిందని తెలిపారు. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఈ నెల 14నుంచి 16తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
The post 14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

  విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు

తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై , ఆ పార్టీ త‌ర‌పున ఎన్నికైన శాస‌న మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వికి రాజీనామా చేసి సంచ‌ల‌నంగా మారిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యంఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా