hyderabadupdates.com Gallery 15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్

15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్

15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్ post thumbnail image

న్యూఢిల్లీ : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ వేదిక‌గా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హ‌బ్ చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. ఏకంగా 15 బిలియ‌న్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా ఇంపాక్ట్ స‌మ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కీల‌క సూచ‌న‌లు చేశారు. ఏఐ వ‌ల్ల ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కొన్ని ఉద్యోగాలు పోతే పోవ‌చ్చు కానీ వాటి స్తానంలో కొత్త ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, అందుకు అనుగుణంగా త‌మ‌ను తాము తీర్చి దిద్దు కోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా గూగుల్ సీఈవోకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. గురువారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ ఘ‌న‌త ఏపీకి ద‌క్కింద‌న్నారు.
ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. నిరాడంబరమైన తీరప్రాంత నగరమైన విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతోందని అన్నారు మంత్రి. ఈ హబ్‌లో పెద్ద ఎత్తున కంప్యూట్ , సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఉంటాయన్నారు. ఇవి భారతదేశానికి ఉద్యోగాలతో పాటు ఏఐ సామర్థ్యాలను తీసుకు వస్తాయన్నారు. ఈ పరివర్తన సాంకేతికత , మౌలిక సదుపాయాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో ప్రతిబింబిస్తుంద‌ని పేర్కొన్నారు. డేటా రెసిడెన్సీ, భద్రతతో పాటు దీర్ఘకాలిక దేశీయ సామర్థ్య విలువపై ప్రత్యేక దృష్టి సారించడం జ‌రిగింద‌న్నారు. సిద్ధంగా ఉన్న డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఓపెన్‌ఏఐ , టాటా గ్రూప్ భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
The post 15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్

ముంబై : హైద‌రాబాద్ కు చెందిన తిల‌క్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ గా ఛాన్స్ ఇచ్చినా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంసన్ వ‌రుస‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్

అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జుడీషియ‌ల్ అకాడ‌మీఅత్యాధునిక సౌక‌ర్యాల‌తో జుడీషియ‌ల్ అకాడ‌మీ

అమరావతి : అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య‌‌‌ కాంత్ శంఖుస్థాపన చేశారు. ఈ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎంతిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా