hyderabadupdates.com Gallery 15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్

15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్

15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్ post thumbnail image

న్యూఢిల్లీ : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ వేదిక‌గా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హ‌బ్ చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. ఏకంగా 15 బిలియ‌న్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా ఇంపాక్ట్ స‌మ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కీల‌క సూచ‌న‌లు చేశారు. ఏఐ వ‌ల్ల ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కొన్ని ఉద్యోగాలు పోతే పోవ‌చ్చు కానీ వాటి స్తానంలో కొత్త ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, అందుకు అనుగుణంగా త‌మ‌ను తాము తీర్చి దిద్దు కోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా గూగుల్ సీఈవోకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. గురువారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ ఘ‌న‌త ఏపీకి ద‌క్కింద‌న్నారు.
ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. నిరాడంబరమైన తీరప్రాంత నగరమైన విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతోందని అన్నారు మంత్రి. ఈ హబ్‌లో పెద్ద ఎత్తున కంప్యూట్ , సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఉంటాయన్నారు. ఇవి భారతదేశానికి ఉద్యోగాలతో పాటు ఏఐ సామర్థ్యాలను తీసుకు వస్తాయన్నారు. ఈ పరివర్తన సాంకేతికత , మౌలిక సదుపాయాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో ప్రతిబింబిస్తుంద‌ని పేర్కొన్నారు. డేటా రెసిడెన్సీ, భద్రతతో పాటు దీర్ఘకాలిక దేశీయ సామర్థ్య విలువపై ప్రత్యేక దృష్టి సారించడం జ‌రిగింద‌న్నారు. సిద్ధంగా ఉన్న డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఓపెన్‌ఏఐ , టాటా గ్రూప్ భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
The post 15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్సంజు సామ్సన్ ఒక క్లాస్ ప్లేయర్ : సూర్య కుమార్

శ్రీ‌లంక : భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యావ‌త్ ప్ర‌పంచం ఈనెల 15న ఆదివారం శ్రీ‌లంక‌లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ దాయాదుల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఈ సంద‌ర్బంగా

PM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి – ప్రధాని మోదీPM Narendra Modi: సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయి – ప్రధాని మోదీ

    పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని… సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా… ఆయన ప్రేమ మనతోనే ఉందని చెప్పుకొచ్చారు. బుధవారం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటుAP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

  విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) బీహెచ్‌ భవానీ శంకర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వోల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్‌