hyderabadupdates.com Gallery 20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న

20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న

20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా పాల‌న‌లో తీసుకున్న నిర్ణ‌యాలు, చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా మంజూరు చేసిన నిధుల గురించి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఈ కింద వివ‌రాలు ఇలా ఉన్నాయి.
1. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ. 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
2. స్త్రీ శక్తి : 43.51 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు… రూ.1,532 కోట్లు ఖర్చు.
3. దీపం 2 పథకం : రాష్ట్రంలోని 1.08 కోట్ల కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ. ఇప్పటికి 3.64 కోట్ల సిలిండర్లు అందజేత. ఇందుకు రూ.2,891 కోట్లు వ్యయం
4. అన్నదాత సుఖీభవ : 46.86 లక్షల మంది రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేల చొప్పున సాయం… ఇప్పటికి రెండు విడతల్లో రూ.6,310 కోట్లు జమ
5. ఎన్టీఆర్ భరోసా : ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు. ఇప్పటికి రూ.58,654 కోట్లు వ్యయం. దేశంలో అత్యధిక మొత్తంలో, అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా రికార్డు.
6. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం… వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం.
7. మత్స్యకార భరోసా : ఏడాదికి రూ.20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు.
8. నేతన్నలకు ఉచిత విద్యుత్ : మర మగ్గాలకు నెలకు 500, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. లక్షకు పైగా చేనేతల కుటుంబాలకు లబ్ది.
9. ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000. రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
10. అన్నా క్యాంటిన్ : రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటిన్లు, అన్న క్యాంటీన్ ద్వారా 7.50 కోట్ల భోజనాలు
11. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు – స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
12. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ…అన్ని వర్గాలకు సమన్యాయం
13. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం
14. ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం
15. అర్చకులకు వేతనం నెలకు రూ.15,000కు పెంపు -నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000, జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం చెల్లింపు
16. మెగా డీఎస్సీ : ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ
17. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి. స్టైఫండ్ రూ.4,500 నుంచి రూ.12,500కు పెంపు
18. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ – రెవెన్యూ సదస్సులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
19. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు – బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు
20. ప్రతీ నెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. పట్టణ ప్రాంతాల్లో 100 శాతం డోర్ టు డోర్ కలెక్షన్… ఇప్పటికి 105 లక్షల టన్నుల చెత్త తొలగింపు. చెత్తపన్ను రద్దు.
21. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు. మరో రూ.3,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం – పల్లెపండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం
22. కొత్తగా 25 పాలసీలు – పరిశ్రమగా పర్యాటక రంగం గుర్తింపు – పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు – 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం
23. విశాఖ సీఐఐ సమ్మిట్ 610 ఒప్పందాలు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలు
24. 14 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.74 పెట్టుబడులకు ఆమోదం, 8.36 లక్షల ఉద్యోగాలు
25. విశాఖలో 15 బిలియన్ డాలర్లతో (రూ. 1.25 లక్షల కోట్లు) గూగుల్ ఎఐ డేటా సెంటర్ ఏర్పాటు
26. అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన. విశాఖ ఐటీ హబ్, రిలయన్స్ డేటా సెంటర్‌కు అడుగులు, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
27. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన. రెండేళ్లలో ఎగుమతులు
28. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు, 20కిపైగా ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు
29. విశాఖలో యోగాంధ్ర నిర్వహణ.., కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ సక్సెస్
30. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం – పేద విద్యార్ధులకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు
31. పంచాయతీ రాజ్ : రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణ, దాదాపు 3 వేల పనులకు శ్రీకారం… పంచాయతీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు. రూ.3,050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన, 1.21 కోట్ల మంది దాహార్తిని తీర్చాలని లక్ష్యం. అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్
32. విద్యారంగం : విద్యా వ్యవస్థలో పెనుమార్పులు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ – గిన్నిస్ రికార్డ్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా టీచర్ల బదిలీలు. విద్యార్ధుల్లో పరిశుభ్రత పెంచేలా ‘ముస్తాబు’
33. గేట్స్ ఫౌండేషన్, టాటాలతో సంజీవని ప్రాజెక్టు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతిపాదనలు
34. గాడిన పడిన విద్యుత్ రంగం–విద్యుత్ చార్జీలు పెంచేది లేదని ప్రకటన – ట్రూ డౌన్ కింద యూనిట్‌కు రూ.0.13 పైసల చొప్పున తగ్గింపు, రూ.4,498 కోట్ల ట్రూ అప్ భారాన్ని భరిస్తున్న ప్రభుత్వం
35. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం… పెరిగిన మూలధన వ్యయం
36. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం కోసం దరఖాస్తుల స్వీకరణ పూర్తి. 3 లక్షల ఇళ్లకు ఇప్పటికే గృహ ప్రవేశాలు. త్వరలో మరో 5 లక్షల ఇళ్ల ప్రారంభం.
37. ఉచిత ఇసుక పథకం అమలు. నాలా యాక్ట్ రద్దుతో పాటు నిర్మాణ రంగ అనుకూల నిర్ణయాలు
38. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్. బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
39. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి-డ్రగ్స్ అరికట్టాం, ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
40. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, వాట్సప్ గవర్నెన్స్ – మన మిత్ర ద్వారా 921 సేవలు
41. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ
42. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి దక్కిన చోటు-రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఆస్కారం
43. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనులు ప్రారంభం
44. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్ల కేంద్ర సాయం – నష్టాల నుంచి లాభాల బాట
45. దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ..కేంద్ర నిధుల సద్వినియోగం..పేద వర్గాలకు మేలు.
46. రాష్ట్రానికి రూ. 1 లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు
47. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటు… 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. మొత్తం మండలాల సంఖ్య 680కి చేరింది.
48. మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ-కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు (రూ.11 వేల సబ్సిడీ)
49. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్‌ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు రూ.8,120 కోట్లు జమ.
50. మార్కెట్ ఇంటర్వెన్షన్ – పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం
51. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు (ఫిబ్రవరి, 2026)
52. సాగునీటి ప్రాజెక్టులకు ఈ 20 నెలల్లో రూ.23,793 కోట్ల ఖర్చు
53. హంద్రీనీవా పనులు పూర్తి చేసి సీమకు 43 టిఎంసిల తరలింపు
54. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – వేగంగా లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు
55. శరవేగంగా పోలవరం నిర్మాణం – 2027 పుష్కరాలకు పోలవరం ప్రారంభం
56. తుంగభద్ర గేట్ల మరమ్మతులకు ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు
57. ధవళేశ్వరం, శ్రీశైలం, కండలేరు, మైలవరం, గుండ్లకమ్మ, గోరకల్లు, అవుకు వంటి ప్రాజెక్టులకు రూ.610 కోట్లతో మరమ్మతులు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.878 కోట్లతో కాలువల నిర్వహణ, పూడికతీత
58. నీటి భద్రత – సమర్థ నీటి నిర్వహణతో పెరిగిన భూగర్భ జలాలు – 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
59. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రం మీదుగా వెళ్లే 3 హై స్పీడ్ రైల్ కారిడార్ల కేటాయింపు
60. ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు, డిఎ, టిఎ, సరెండర్ లీవ్‌లు, బెనిఫిట్స్ చెల్లింపు. ఆరోగ్య శ్రీ సహా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు.
The post 20 ఏళ్ల పాల‌న ఏపీ రాష్ట్రానికి ఆలంబ‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసిచరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

హైద‌రాబాద్ : భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. రూ. 1000 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఇందులో కీల‌క పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ

Droupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందంDroupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందం

      భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము… దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాతో భారత్‌ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్యరంగం, ఫార్మా రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాల(ఎంఓయూలు)పై సంతకాలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన