hyderabadupdates.com movies 2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు

2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. దీంతో అప్పట్లో ఓటమి ఎదురైందని వివరించారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ కారణంగా ఇకపై 2004లాంటి పరిస్థితులు రాబోవని స్పష్టం చేశారు.

ఆదివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణాసియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ నుంచి విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ వరకు జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, అనేక ప్రాజెక్టులను సమయపాలనతో పూర్తి చేస్తున్నామని చెప్పారు.

అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చెందిందో, రాబోయే రోజుల్లో అమరావతి అంతకంటే మెరుగ్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా గతంలో ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి తాను ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేశారు. బిల్ గేట్స్‌ను కలిసినప్పుడు అనేక షరతులు ఎదురయ్యాయని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం అంత సులభం కాదని అన్నారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులను దాటి హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చామని చెప్పారు.

గత ఐదేళ్లలో అమరావతి పూర్తయి ఉంటే రాష్ట్రానికి ఇప్పటికే అదనపు ఆదాయం వచ్చేదని అన్నారు. అయితే వైసీపీ పాలన కారణంగా ఆలస్యం జరిగిందని విమర్శించారు. అయినప్పటికీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేసి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

Related Post

రోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలురోడ్లకు మహర్దశ… పవన్ కు మంత్రుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడతలోనే రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల

ఆ పల్లెకి.. లోకేష్ డ్రెస్ కి లింకేంటి..?ఆ పల్లెకి.. లోకేష్ డ్రెస్ కి లింకేంటి..?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్టులతో సర్ప్రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ అంటూ నిన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం అయిన పెద్ద కంపెనీల పేర్లను ఆయన