hyderabadupdates.com movies 2026 – ప్యాన్ ఇండియా నామ సంవత్సరం

2026 – ప్యాన్ ఇండియా నామ సంవత్సరం

గడిచిపోయిన ఏడాదిలో టాలీవుడ్ బాగా ఫీలైన లోటు మన ప్యాన్ ఇండియా సినిమాలు ఎలాంటి అద్భుతాలు చేయకపోవడం. ఓజి మూడు వందల కోట్లు దాటినా, అఖండ 2 విపరీతమైన అంచనాలు మోసుకొచ్చినా, వార్ 2 మీద ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నా అవేవి ఇండియా టాప్ 5లోకి వెళ్ళలేదు.

కానీ 2026 దానికి భిన్నంగా బోలెడు ప్రామిసింగ్ మూవీస్, వేల కోట్ల పెట్టుబడులతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాజా సాబ్ తో దీనికి బోణీ జరగాలని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ రేంజ్ హీరో హారర్ జానర్ చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ కంటెంట్ నమ్మకాన్నైతే కలిగించింది.

జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మీద ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవి విడుదలని ప్రకటించారు కానీ టార్గెట్ చేరుకోవడం కొంత డౌట్ గానే ఉంది. రామ్ చరణ్ పెద్దికి చికిరి చికిరి పుణ్యమాని నేషనల్ వైడ్ బజ్ వచ్చేయడంతో బాలీవుడ్ బయ్యర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ ఏకంగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రభాస్ – హను రాఘవపూడిల ఫౌజీని ఇదే సంవత్సరం విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఫిక్సయ్యారు. తేదీ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.

విజువల్ ఎఫెక్ట్స్ కోసం విపరీతమైన జాప్యానికి గురైన చిరంజీవి విశ్వంభర ఆ విషయంలో పూర్తి సంతృప్తి చెందాకే విడుదల తేదీని ప్రకటించుకోనుంది. నిఖిల్ స్వయంభు మేకింగ్ వీడియో చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. కాంతార తరహాలో పీరియాడిక్ సెటప్ కనక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కార్తికేయ 2ని మించి విజయం సొంతం చేసుకోవచ్చు.

ప్రభాస్ మరో మూవీ స్పిరిట్ కూడా డిసెంబరనే ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని ఎన్బికె 111 కూడా ప్యాన్ ఇండియా లెవెలే. ఇవన్నీ చెప్పిన టైంకు చెప్పినట్టు వచ్చేస్తే థియేటర్లు కాసుల గలగలతో కళకళలాడతాయి.

Related Post

తమిళంలో డెబ్యూ హీరో సంచలనంతమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు ఒకట్రెండు ఓకే అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొందరు హీరోయిన్లకు కూడా తొలి సినిమా రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ప్రోమోలతో వచ్చిన

బాబుపై సానుభూతి పెంచుతున్న జ‌గ‌న్‌!!బాబుపై సానుభూతి పెంచుతున్న జ‌గ‌న్‌!!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చూప‌డం .. విమ‌ర్శించ‌డం వంటివి ప్ర‌తిప‌క్ష పార్టీలుగా.. ప్ర‌త్య‌ర్థినాయ‌కులుగా త‌ప్పుకాదు. కానీ, ఆయ‌నను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తే?! అది ముమ్మాటికీ ఈ విమ‌ర్శ‌లు చేసిన వారికి మేలు జ‌ర‌గ‌క‌పోగా.. చంద్ర‌బాబుకు