hyderabadupdates.com Gallery 22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్

22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్

22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్ post thumbnail image

అమరావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మత్స్య విశ్వ విద్యాలయం ప్రధాన లక్ష్యం మత్స్య ఆక్వా సాగు రంగాలలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం. రాష్ట్రంలో ఆర్ఎస్కే లకు సాంకేతిక సాయం అందించడం జ‌రుగుతుంద‌న్నారు . 2026-27లో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వ విద్యాలయం కోసం రూ.39.20 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించడం జ‌రిగింద‌న్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద‌ రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర ఉచిత‌ విద్యుత్ సరఫరా అందించ బ‌డుతోంద‌న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం జరిగింద‌న్నారు అచ్చెన్నాయుడు. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింద‌న్నారు. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722.00 కోట్ల రూపాయలు ప్రతిపాదించామ‌ని తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో, వ్యవసాయ, అనుబంధ పనుల కోసం 2,783 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల పని దినాలు కల్పించిన‌ట్లు చెప్పారు అచ్చెన్నాయుడు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి, వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) కింద వ్యవసాయం, అనుబంధ పనుల కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్ర‌తిపాదించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి.
The post 22.5 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు ఉచిత విద్యుత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్ర‌బాబు20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం : చంద్ర‌బాబు

అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు,

కీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తాకీల‌క మ్యాచ్ ల‌కు వేదిక కానున్న కోల్ క‌తా

కోల్ క‌తా : ఐసీసీ టోర్నీలో భాగంగా కీల‌క‌మైన మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జ‌ట్టు ఒక‌వేళ సెమీ ఫైన‌ల్ లేదా ఫైన‌ల్ కు చేరుకుంటే క‌చ్చితంగా ఇండియాలోని కోల్ క‌తా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్

Banjara: ఎస్టీ రిజర్వేషన్ కోసం చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్షBanjara: ఎస్టీ రిజర్వేషన్ కోసం చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష

      తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి,