hyderabadupdates.com Gallery 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు post thumbnail image

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్య దేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ సప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) సూర్యప్రభ వాహనం. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. ఇదిలా ఉండ‌గా ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.
The post 25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌తవ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌త

అమ‌రావ‌తి : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వ్యక్తిగతంగా అందించామని

Amit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌ షాAmit Shah: జోహో మెయిల్‌కు మారిన అమిత్‌ షా

    దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపును కేంద్రమంత్రులు అందిపుచ్చుకుంటున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా ‘జోహో’ ప్లాట్‌ఫామ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. కేంద్ర