hyderabadupdates.com Gallery 3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌ న‌ల్ల మ‌ల్లారెడ్డి

3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌ న‌ల్ల మ‌ల్లారెడ్డి

3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌  న‌ల్ల మ‌ల్లారెడ్డి post thumbnail image

హైద‌రాబాద్ : మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం కాచ‌వాని సింగారం గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 66 లో ఉన్న 6.12 ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమేనంటూ హైడ్రా స్ప‌ష్టం చేసింది. జిల్లా స‌ర్వే అధికారి చాలా స్ప‌ష్టంగా ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించి హ‌ద్దుల‌ను చూపిన త‌ర్వాతే అక్క‌డ హైడ్రా ఫెన్సింగ్ వేసిందని తెలిపింది.. ఇప్ప‌టికే ఇళ్లు క‌ట్టుకున్న వారిని మిన‌హాయించి.. మిగిలిన భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 62తో పాటు 63ను చూపించి 66లొ ఉన్న ప్ర‌భుత్వ భూమిలోకి చొర‌బ‌డి ప్లాట్లుగా విక్ర‌యించింది హ‌నుమంత‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ని స్ప‌ష్ట‌మైన ఆధారాలు హైడ్రా వ‌ద్ద ఉన్నాయి. దివ్యాన‌గ‌ర్ లే ఔట్‌లో భాగంగానే ఇక్క‌డ ప్లాట్లు అమ్మ‌డమైంద‌ని తెలిపింది . 66 స‌ర్వే నంబ‌రులోని ప్ర‌భుత్వ భూమిని త‌న విద్యా సంస్థ‌ల‌కు అంద‌జేయాల‌ని 2009లో న‌ల్ల‌మ‌ల్లారెడ్డి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇలా 6.12 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని త‌న ఆధీనంలో ఉంచుకొని 3 ఎక‌రాల మేర న‌ల్ల మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యులు మామిడి తోట వేశారు. ప్రైవేటు భూమికి సంబంధించిన 62, 63 స‌ర్వే నంబ‌ర్లు చూపించి 66 స‌ర్వే నంబ‌ర్‌లోని ప్ర‌భుత్వ భూమిలో దాదాపు 50 ప్లాట్ల‌ను మ‌లిపెద్ది హ‌నుమంత‌రెడ్డి కుటుంబ స‌భ్యులు అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌కు అమ్మేశార‌ని ఆరోపించింది.
మ‌లిపెద్ది హ‌నుమంత రెడ్డి కుటుంబ స‌భ్యులు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటే.. న‌ల్ల‌మ‌ల్లారెడ్డి నేరుగా 3 ఎక‌రాల ప్ర‌భుత్వ‌భూమిలో మామిడి తోట వేశారు. ఇలా మొత్తం 6.12 ఎక‌రాల‌ను కాజేసే ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా అడ్డుకుంది. 6.12 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి 2010లో న‌ల్ల మ‌ల్లారెడ్డికి ఘ‌ట్కేస‌ర్ ఎమ్మార్వో నోటీసులు కూడా ఇచ్చారని తెలిపింది హైడ్రా. ప్ర‌భుత్వ‌భూమిలో ప్లాట్లు విక్ర‌యించినందుకు గాను బాధితుల‌కు ప్ర‌త్యామ్నాయం చూపాల్సిన న‌ల్ల మ‌ల్లారెడ్డి, హ‌నుమంత‌రెడ్డి వారికి అన్యాయం జ‌రిగిందంటూ గగ్గోలు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించినందుకు గాను మేడిప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో హైడ్రా ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు న‌ల్ల‌మ‌ల్లారెడ్డి, హ‌నుమంత‌రెడ్డి కుటుంబ స‌భ్య‌లుపై కేసు (94 ఆఫ్ 2026 సెక్ష‌న్లు 318(4),329(3)బీఎన్ ఎస్‌,3 పీడీపీపీఏ) న‌మోద‌య్యింది. గ‌తంలోనే జిల్లా స‌ర్వే అధికారి నియ‌మించిన స‌ర్వే క‌మిటీ ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించి సంబంధిత వ్య‌క్తుల‌కు నోటీసులు జారీ చేసిందనిత తెలిపింది.
The post 3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌ న‌ల్ల మ‌ల్లారెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Cyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపానుCyclone Montha: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మొంథా’ తుపాను

    ఆంధ్రప్రదేశ్‌కి తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తుంది. ఇది రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీనితో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28,

Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షంDonald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

Donald Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్‌… దక్షిణకొరియా వేదికగా ట్రంప్ (Donald Trump)… మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.