hyderabadupdates.com movies 30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు హీరోగా జీవిత ఖైదీ, అడ‌విదొర లాంటి సినిమాలు నిర్మించారాయ‌న‌. ప్ర‌స్తుతం అప్పుడ‌ప్పుడు చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. ప‌దేళ్ల ముందు ఆయ‌న డ‌బ్ చేసి రిలీజ్ చేసిన త‌మిళ చిత్రం బిచ్చ‌గాడు ఎంత సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. ఆ త‌ర్వాత నేరుగా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన చ‌ద‌ల‌వాడ‌కు పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఐతే ఇప్పుడాయ‌న రూ.30 కోట్ల పెట్టుబ‌డితో ప‌ది చిన్న సినిమాలు తీయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. 

ఇటీవ‌లే కొత్త‌గా ఎన్నికైన‌ ద‌ర్శకుల సంఘం కార్య‌వ‌ర్గంతో క‌లిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు చ‌ద‌ల‌వాడ‌. ద‌ర్శ‌కుల సంఘంలో చాలామంది స‌రైన అవ‌కాశాలు రాక ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. అందులో ప్ర‌తిభావంతులైన ప‌ది మందికి అవ‌కాశం క‌ల్పిస్తూ సినిమాలు నిర్మించాల‌ని.. ఇందుకోసం రూ.30 కోట్లు పెట్టుబ‌డి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వి.ఎన్.ఆదిత్య‌, సాయి రాజేష్ స‌హా ప‌లువురు ద‌ర్శ‌కుల స‌మ‌క్షంలో ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఎవ‌రితో సినిమాలు తీయాలి.. ఎలాంటి చిత్రాలు నిర్మించాలి అనే విష‌య‌మై ప‌రిశీల‌న జ‌రిపేందుకు మాతృదేవోభవ దర్శకుడు అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు చ‌ద‌ల‌వాడ వెల్ల‌డించారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం సినీ నిర్మాణ పోక‌డ‌ల గురించి చ‌ద‌ల‌వాడ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఒక‌ప్పుడు శోభ‌న్ బాబుతో రూ.70 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో జీవిత ఖైదీ సినిమాను నిర్మించాన‌ని.. ఆ సినిమా ఫుల్ ర‌న్లో రూ.7 కోట్ల షేర్ చేసింద‌ని.. కానీ ఇప్పుడు నిర్మాత‌కు లాభాలు రావ‌డం గ‌గ‌నంగా మారింద‌ని ఆయ‌న చెప్పారు. సినీ నిర్మాణ తీరే మారిపోయింద‌ని.. బ‌డ్జెట్లు పెరిగిపోయాయ‌ని.. నిర్మాత దారుణంగా దెబ్బ‌తింటున్నాడ‌ని.. ఈ ప‌రిస్థితుల్లో సినిమాల నిర్మాణం చాలా క‌ష్టంగా మారిపోయింద‌ని ఆయ‌న‌న్నారు.

Related Post

గుజ‌రాత్‌లో మంత్రి వ‌ర్గ సంపూర్ణ ప్ర‌క్షాళ‌న‌: జ‌డేజా భార్య‌కు పీఠంగుజ‌రాత్‌లో మంత్రి వ‌ర్గ సంపూర్ణ ప్ర‌క్షాళ‌న‌: జ‌డేజా భార్య‌కు పీఠం

గుజ‌రాత్‌లో తొలిసారి బీజేపీ స‌ర్కారు మ‌ధ్యంత‌రంగా సంపూర్ణ మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసింది. గ‌తంలో మంత్రులను ఒక‌రిద్ద‌రిని మార్చిన సంస్కృతి ఉంది. అదేస‌మ‌యంలో సంపూర్ణంగా ముఖ్య‌మంత్రితో పాటు అంద‌రినీ మార్చిన ప‌రిస్థితి కూడా ఉంది. కానీ, తొలిసారి ముఖ్య‌మంత్రిని అలానే ఉంచి..

ఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలుఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలు

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ఏ స్థాయిలో సెలబ్రేషన్ ఉందో.. ఇప్పుడు అదే స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇండియన్