hyderabadupdates.com movies 33 సంవత్సరాల తర్వాత కల్ట్ సీక్వెల్

33 సంవత్సరాల తర్వాత కల్ట్ సీక్వెల్

సంజయ్ దత్ హీరోగా ఎన్ని సినిమాలు చేసినా తనకో స్టార్ స్టేటస్ తీసుకొచ్చి మార్కెట్ ని పెంచిన బ్లాక్ బస్టర్ ముమ్మాటికీ ఖల్ నాయక్ ఒక్కటే. 1993లో రిలీజైన ఈ యాక్షన్ డ్రామా ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ అప్పటిదాకా పరిశ్రమ చూడని ఒక కొత్త ట్రెండ్ దీని ద్వారానే సృష్టించారు. ముఖ్యంగా చోళీ కే పీచే క్యా హై పాట యావత్ ప్రేక్షకులను ఊపేసింది. పేరుకి జాకీ శ్రోఫ్ హీరోగా కనిపించినా ఖల్ నాయక్ పూర్తిగా సంజయ్ దత్ వన్ మ్యాన్ షో.ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కల్ట్ మూవీకి సీక్వెల్ రాబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తిరిగి సంజయ్ దత్తే తన పాత్రను వయసు మళ్ళిన తర్వాత పోషించబోతున్నారు. నిన్న చిన్న వీడియో టీజర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. పొడవాటి జుత్తుతో ఈ వయసులో కూడా సంజయ్ దత్ లుక్స్ చూస్తుంటే మూవీ లవర్స్ వావ్ అనుకోకుండా ఉండలేరు. ఈసారి దురంధర్ తో రికార్డులు తిరగరాసిన జియో స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండనుంది.వినడానికి బాగానే ఉంది కానీ మూడు దశాబ్దాల తర్వాత ఖల్ నాయక్ కంటిన్యుయేషన్ అంటే సాహసమే. ఎందుకంటే ఈ సినిమాతో కనెక్షన్ తొంభై దశకం చిన్న పిల్లలు, టీనేజ్, యూత్, మధ్యవయస్కులకు మాత్రమే ఉంది. ఇప్పటి జెన్ జీ కిడ్స్ కి దీని గురించి అవగాహన తక్కువ. అయినా సరే రిస్క్ కు సిద్ధపడటం చూస్తుంటే కంటెంట్ ఏదో స్ట్రాంగ్ గానే రాసుకున్నట్టు ఉన్నారు. క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ వివరాలు పొందుపరచకుండా జాగ్రత్త పడ్డారు.ఒకవేళ ఖల్ నాయక్ రిటర్న్స్ కనక హిట్ అయితే ఇలా పాత క్లాసిక్స్ ని మళ్ళీ కొనసాగింపు చేసే ట్రెండ్ మొదలవుతుంది. అయినా ఇదేమి కొత్త కాదు. డాన్ 2 అలా ట్రై చేసిందే. షోలేని కూడా ఇలాగే పార్ట్ 2 చేద్దామని కొందరు రమేష్ సిప్పిని అడిగారు కానీ ఆయన ఒప్పుకోలేదని ముంబై టాక్.

పాత ఖల్ నాయక్ లో నటించిన మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, రమ్యకృష్ణ, నీనా గుప్తా అందరూ అందుబాటులోనే ఉన్నారు. వీళ్ళందరూ రెండో భాగంలో ఉంటారో లేదో వేచి చూడాలి. ఈ సీక్వెల్ బాధ్యతలు సంజయ్ దత్, అక్ష కంబోజ్ సంయుక్తంగా నిర్వహించనుండగా దర్శకత్వం ఎవరు చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు.

Related Post

వింతలు విడ్డూరాలు నిండిన ‘నాగబంధం’వింతలు విడ్డూరాలు నిండిన ‘నాగబంధం’

పెదకాపుతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో విరాట్ కర్ణ తర్వాత సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నాడు కానీ తాజాగా విడుదలైన నాగబంధం ట్రైలర్ చూస్తుంటే ఇదేదో ఆషామాషీ కంటెంట్ లా కనిపించడం లేదు. హిమాలయ పర్వతాలు, అనంత పద్మనాభ స్వామి గుడిని