hyderabadupdates.com Gallery 47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామ‌న్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించడం జ‌రిగింద‌ని చెప్పారు. గత పాలకులు రైతులకు చెల్లించాల్సిన రూ.1670 కోట్ల ధాన్యం బకాయిలు కూడా మేమే చెల్లించాం అన్నారు సీఎం. రైతు ఆత్మహత్యలు కూడా ఆ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. ఇప్పుడు వాటిని నియంత్రించేలా ప్రతీ ఘటననూ ఆడిట్ చేయించేలా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున తీసుకు రావటంతో పాటు ఏఐ ఆగ్రానమిస్టు సేవలు కూడా అందేలా చేస్తాం అన్నారు. 14,230 కోట్ల మేర ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయ‌ని చెప్పారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్‌ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 8,168 గ్రామాల్లో 15 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు సీఎం. త్వరలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సాహం ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రస్తుతం రాయలసీమలో ఉద్యాన పంటలు 400 మిలియన్ టన్నుల మేర సాగు అవుతున్నాయని అన్నారు. వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి అయ్యేలా లక్ష్యంగా పనిచేస్తున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. క్లస్టర్ విధానం ద్వారా ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు.
The post 47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మేకేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, త‌న తండ్రి కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స‌ర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నోటీసులు

CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులుCII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

    విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తొలి రోజు శుక్రవారం 40 సంస్థలతో రూ.3,49,476 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 4,15,890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టంశ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో