hyderabadupdates.com Gallery 50 మందిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తెచ్చిన‌ డీఆర్ ఎఫ్‌

50 మందిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తెచ్చిన‌ డీఆర్ ఎఫ్‌

50 మందిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తెచ్చిన‌ డీఆర్ ఎఫ్‌ post thumbnail image

హైద‌రాబాద్ : పెను ప్ర‌మాదాన్ని హైడ్రా త‌ప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ ద్వ‌రా మంట‌ల‌ను క్ష‌ణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న‌50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. అమీర్‌పేట‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీల‌గిరి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ కేబుళ్లున్న ప్యాన‌ల్ బోర్డులో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. ఈ స‌మాచారం హైడ్రా కంట్రోల్ రూమ్‌కు స‌రిగ్గా ఉద‌యం 11.01 గంట‌ల‌కు అందింది. క్ష‌ణాల్లో ఫీల్డ్‌మీద ఉన్న‌హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాల‌కు హైడ్రా కంట్రోల్ రూం సిబ్బంది చేర్చారు. ఆ చేరువ‌లో ఉన్న హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది స‌రిగ్గా 11.04 నిమిషాల‌కు అక్క‌డ‌కు చేరుకుని ఫైర్ ఎక్స్టింగ్విష‌ర్ల ద్వ‌రా మంట‌ల‌ను నియంత్రించారు. ఒక ప‌క్క మంట‌ల‌ను అదుపులోకి తెస్తూనే హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇంత‌లో మ‌రో రెండు బృందాలు అక్క‌డ‌కు చేరుకున్నాయి. వీరితో పాటు.. ఫైర్‌, పోలీసు విభాగాలు కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి.
మెట్ల మార్గం వ‌ద్దే క‌రెంటు కేబుళ్లు త‌గ‌ల ప‌డ‌డం.. పొగ‌లు క‌మ్మేయ‌డంతో రెండో అంత‌స్తులో చిక్కుకున్న వారిని హైడ్రా డీఆర్ ఎఫ్ వ‌ద్ద సిద్ధంగా ఉన్న రోప్ ల్యాడార్ల ద్వారా కింద‌కు దించారు. ఇలా మంట‌ల‌నార్ప‌డం.. వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభమ‌వ్వ‌డంతో ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ‌హాని క‌ల‌గ‌లేదు. మంట‌ల‌నార్ప‌డం ఏమాత్రం ఆల‌స్యం అయినా..పెను ప్ర‌మాదం సంభ‌వించేది. అమీర్‌పేట అంటేనే ఐటీ రంగంతో పాటు.. ప‌లు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌కు శిక్ష‌ణ ఇచ్చే అడ్డా. ఇక్క‌డ ఉన్న మైత్రేయివ‌నం, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో వంద‌లాది శిక్ష‌ణ కేంద్రాలున్నాయి. ప్ర‌తి అంత‌స్తులో ప‌దుల సంఖ్య‌లో కోచింగ్ సెంట‌ర్లున్నాయి. ఇక్క‌డ మంట‌లంటుకుంటే ఆ ప్ర‌మాదాన్ని ఊహించ‌లేం. వేలాది మంది ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతుంటారు. అమీర్‌పేట‌లో అగ్ని ప్ర‌మాదం అని తెలియ‌డంతోనే న‌గ‌ర‌మంతా అప్ర‌మ‌త్త‌మైంది. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది క్ష‌ణాల్లో స్పందించిన తీరుతో పాటు.. మంట‌ల‌ను ఆప‌డం, పై అంతుస్తుల్లో చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా రోప్ ల్యాడార్ల సాయంతో కింద‌కు దించ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. అక్క‌డ అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాల‌ను క్షేత్ర స్థాయిలో చూశారు.
The post 50 మందిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తెచ్చిన‌ డీఆర్ ఎఫ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే

Minister Ponnam Prabhakar Asks political parties To submit Affidavits In High Court supporting BC BillMinister Ponnam Prabhakar Asks political parties To submit Affidavits In High Court supporting BC Bill

Minister Ponnam Prabhakar demanded that all the political parties that supported the BC Reservation Bill in the Legislative Assembly submit affidavits in High Court stating that they fully support the reservations

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.